Vande Bharat: హైదరాబాద్‌కు మరో 4 వందేభారత్ రైళ్లు.. ఏయే రూట్లలో తిరగనున్నాయంటే.?

|

Aug 26, 2023 | 7:31 PM

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక. మరో 4 వందేభారత్ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. ఈ మేరకు ఇండియన్ రైల్వేస్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ప్రస్తుతం రన్ అవుతున్న సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైళ్లు 120 శాతానికిపైగా ప్యాసింజర్ ఆక్యుపెన్సీతో పరుగులు పెడుతున్నాయి.

Vande Bharat: హైదరాబాద్‌కు మరో 4 వందేభారత్ రైళ్లు.. ఏయే రూట్లలో తిరగనున్నాయంటే.?
ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల మధ్య ఈ వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ బోగీలతో నడుస్తున్న ఈ రైళ్లల్లో.. స్లీపర్ కోచ్ బోగీలను సైతం అమర్చాలని కేంద్ర రైల్వే శాఖ చూస్తోంది. అందులో భాగంగా తయారీని కూడా మొదలుపెట్టింది.
Follow us on

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక. మరో 4 వందేభారత్ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. ఈ మేరకు ఇండియన్ రైల్వేస్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ప్రస్తుతం రన్ అవుతున్న సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైళ్లు 120 శాతానికిపైగా ప్యాసింజర్ ఆక్యుపెన్సీతో పరుగులు పెడుతున్నాయి. ఇక ఇప్పుడు వాటితో కలిపి మరో 4 వందేభారత్ రైళ్లు జత కానున్నాయి. కాచిగూడ-యశ్వంత్‌పూర్(బెంగళూరు), సికింద్రాబాద్-పూణే, సికింద్రాబాద్-నాగ్‌పూర్, విజయవాడ-చెన్నై(వయా తిరుపతి) రూట్లలో ఈ రైళ్లు నడవనున్నాయి. ఇప్పటికే నాగ్‌పూర్, బెంగళూరు రూట్లలో వందేభారత్ రైళ్ల ట్రయిల్ రన్‌ పూర్తి కాగా, పూణే రూట్‌లో జన్‌శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను రీప్లేస్ చేయనుంది వందేభారత్. అలాగే ఆయా రూట్లలో రైళ్లు గరిష్టంగా 130 కిమీ వేగంతో పరుగులు పెట్టేలా దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే ట్రాక్‌ల అప్‌గ్రేడ్ పూర్తి చేసింది. ఇదిలా ఉంటే.. కాచిగూడ – యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కోసం ప్రయాణికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం సికింద్రాబాద్-బెంగళూరు మధ్య నడుస్తోన్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రయాణం 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది. అయితే వందేభారత్‌ రాకతో అది కాస్తా.. 8.30 గంటలకు సమయానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు రైల్వే అధికారులు. ఈ రైలు కాచిగూడ నుంచి ప్రతీ రోజూ ఉదయం 6 గంటలకు బయల్దేరి.. మధ్యాహ్నం 2:30 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు యశ్వంత్‌పూర్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11:30 గంటలకు కాచిగూడ చేరుతుంది. మరోవైపు సికింద్రాబాద్ – పూణే మధ్య నడుస్తోన్న శతాబ్ది సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ స్థానంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ యోచిస్తోంది. శతాబ్ది ప్రస్తుతం పరిమిత స్టాప్‌లతో సికింద్రాబాద్ నుంచి పూణేకి 8.25 గంటల్లో చేరుతుంది. అయితే, ఈ మార్గంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టడం వల్ల ప్రయాణ సమయం మరింతగా తగ్గుతుందని అంచనా.

అటు సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ ఏడు గంటల ప్రయాణ సమయం కాస్తా.. ఐదు గంటలకు చేస్తుందని భావిస్తున్నారు. సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు కాజీపేట, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హర్షా స్టేషన్లలో ఆగనుందట. కాగా, వందేభారత్ రైళ్ల నిర్వహణ కోసం సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ రైలు డిపోలను అప్‌గ్రేడ్ చేస్తోంది దక్షిణ మధ్య రైల్వే శాఖ.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం..