Amit Shah: అమిత్‌ షా పర్యటన చివరి నిమిషంలో స్వల్ప మార్పులు.. ఈటల నివాసానికి షా.. ఎందుకంటే

|

Sep 17, 2022 | 5:40 AM

Hyderabad Liberation Day: తెలంగాణ వియోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పాల్గొననున్నారు. శుక్రవారం రాత్రి 9.50 గంటలకు..

Amit Shah: అమిత్‌ షా పర్యటన చివరి నిమిషంలో స్వల్ప మార్పులు.. ఈటల నివాసానికి షా.. ఎందుకంటే
Minister Amit Shah
Follow us on

Hyderabad Liberation Day: తెలంగాణ వియోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పాల్గొననున్నారు. శుక్రవారం రాత్రి 9.50 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు నేతలు. అయితే రాత్రి అమిత్‌షా పోలీస్‌ అకాడమీలో బస చేశారు. శనివారం తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొంటారు. అయితే నేడు అమిత్‌ షా పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. శనివారం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను అమిత్‌ షా పరామర్శించనున్నారు. ఇటీవల ఈటల తండ్రి మరణించారు. దీంతో ఆయనను పరామర్శించేందుకు ఈటల ఇంటికి వెళ్లనున్నారు. 15 నిమిషాల పాటు ఈటల కుటుంబ సభ్యులతో అమిత్‌ షా భేటీ అవుతారు.

అమిత్‌ షాతో పాటు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు ఉంటారు. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇదే సమయంలో బీజేపీ రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్వయంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌లో వేడుకలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా జరిగే కార్యక్రమానికి బీజేపీ, కేంద్ర ప్రభుత్వ విభాగాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. దీంతో అమిత్‌ షా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే విమోచన దినోత్సవ వేడుకల్లో ప్రసంగించనున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్‌ 16,17,18 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించేందుకు నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి