
హైదరాబాద్, 14 సెప్టెంబర్: వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం జిహెచ్ఎంసి పరిధిలో ఈ నెల 14వ తేదీ నుండి 17వ తేదీ వరకు వార్డు వారీగా మట్టి గణేష్ విగ్రహాలు పంపిణీ చేయనున్నట్లు జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ ఒక ప్రకటనలో తెలిపారు. వార్డుకు 2,500 చొప్పున ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రతి సర్కిల్ కు ఒక ఏ.ఎం.ఓ.హెచ్ ను ఇన్ చార్జీగా, ప్రతి వార్డుకు వార్డు ఆఫీసర్ ను ఇన్ చార్జీగా నియమించామని కమిషనర్ తెలిపారు.
ఈ నెల 14వ తేదీన కాప్రా సర్కిల్ భారతీయ విద్యా భవన్, సైనిక్ పురి, వాయుపురి లో హెచ్.ఎం.డి.ఏ ద్వారా పంపిణీ చేస్తారు. జిహెచ్ఎంసి ద్వారా 16, 17 తేదీల్లో కాప్రా సర్కిల్ ఏ.ఎస్.రావు నగర్, చర్లపల్లి, మీర్ పేట్ ఎస్.బి కాలనీ, మల్లాపూర్, నాచారం వార్డు కార్యాలయాల్లో హెచ్.ఎం.డి.ఏ, జిహెచ్ఎంసి సంయుక్తంగా 16800 వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తారు.
ఉప్పల్ సర్కిల్ లో చిలుకానగర్, హబ్సీగూడ, రామంతపూర్, ఉప్పల్ వార్డు కార్యాలయాల్లో మొత్తం 11800 వినాయక మట్టి విగ్రహాలను ఈ నెల 16,17 తేదీలలో పంపిణీ చేయబడును.
హయత్ నగర్ సర్కిల్ నాగోల్ వార్డు పరిధిలో హిందూ అరణ్యప్రాంతంలో హెచ్.ఎం.డి.ఏ ద్వారా 3300 వినాయక మట్టి విగ్రహాల పంపిణీ చేస్తారు. హయత్ నగర్ సర్కిల్ లో హెచ్.ఎం.డి.ఏ, జిహెచ్ఎంసి 11,800 వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తారు.
ఎల్బీనగర్ సర్కిల్ వనస్థలిపురంలో హెచ్.ఎం.డి.ఏ ద్వారా ఈ నెల 14,15 తేదీల్లో రాజీవ్ గాంధీ పార్కు లో పంపిణీ తో పాటు జిహెచ్ఎంసి ద్వారా వార్డు ఆఫీస్ లో పంపిణీ చేస్తారు.
ఎల్బీనగర్ సర్కిల్ లో హస్తినాపురం, చంపాపేట్, లింగోజిగూడ ఈ నెల 16,17 తేదీల్లో 11,800 వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తారు.
సరూర్ నగర్ సర్కిల్ లో హెచ్.ఎం.డి.ఏ ద్వారా 14,15 తేదీల్లో ప్రియదర్శిని పార్కు, జిహెచ్ఎంసి ద్వారా వార్డు కార్యాలయంలో పంపిణీ చేస్తారు.
సరూర్ నగర్ సర్కిల్ లోని రామకృష్ణ పురం, కొత్తపేట, చైతన్యపురి, గడ్డిఅన్నారం వార్డులలో 14,300 వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేయనున్నారు. దీంతో మొత్తం ఎల్బీనగర్ జోన్ లో 66,500 మట్టి విగ్రహాలు పంపిణీ చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.
మలక్ పేట్ సర్కిల్ లో సైదాబాద్, మూసారాంబాగ్, ఓల్డ్ మలక్ పేట్, అక్బర్ బాగ్, అజంపుర, చావని, డబీర్ పుర వార్డులలో 16,17 తేదీల్లో 17,500 మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తారు.
సంతోష్ నగర్ సర్కిల్ లోని రెయిన్ బజార్, తలాప్ చంచలం, కుర్మల్ గూడ, ఐ.ఎస్.సదన్, సంతోష్ నగర్ లలో జిహెచ్ఎంసి ద్వారా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయనున్నారు. హెచ్.ఎం.డి.ఏ ద్వారా గౌలిపుర లోని వేద ధర్మ ప్రకాష్ స్కూల్ లో జిహెచ్ఎంసి, హెచ్.ఎం.డి.ఏ ద్వారా మొత్తం 16800 విగ్రహాలు పంపిణీ చేయనున్నారు.
చాంద్రాయణగుట్ట సర్కిల్ లోని లలిత్ బాగ్, రియాసత్ నగర్, కంచన్ బాగ్, బార్కాస్, చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, జంగం మెట్ వార్డులలో ఈ నెల 16,17 తేదీలలో మొత్తం 17,500 వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తారు.
చార్మినార్ సర్కిల్ లోని పత్తర్ గట్టి, మొగల్ పుర, శాలిబండ, ఘాన్సీ బజార్, పురనాపూల్ వార్డులలో ఈ నెల 16,17 తేదీల్లో మొత్తం 12,500 వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేయనున్నారు.
ఫలక్ నమా సర్కిల్ లోని ఫలక్ నుమా, నవాబ్ సాబ్ కుంట, దూద్ బౌలి, జహన్మా, రాంనాస్ పుర, కిషన్ బాగ్ వార్డులలో ఈ నెల 16, 17 తేదీల్లో మొత్తం 15,000 వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేయనున్నారు.
రాజేంద్రనగర్ సర్కిల్ లోని సులేమాన్ నగర్, శాస్త్రిపురం, మైలార్ దేవరపల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్ వార్డులలో ఈ నెల 16,17 తేదీల్లో 14,300 వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేయనున్నారు. చార్మినార్ జోన్ లో మొత్తం 93,600 మట్టి విగ్రహాలు పంపిణీ చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.
మెహిదీపట్నం సర్కిల్ లోని హెచ్.ఎం.డి.ఏ ద్వారా మెహిదీపట్నం రైతు బజార్ లో ఈ నెల 17వ తేదీ, జిహెచ్ఎంసి ద్వారా వార్డు కార్యాలయాల్లో 16,17 తేదీల్లో పంపిణీ. గుడిమల్కాపూర్, ఆసిఫ్ నగర్, అహ్మద్ నగర్, రెడ్ హిల్స్, జిహెచ్ఎంసి ద్వారా విజయనగర్ కాలనీ, మల్లేపల్లి, ప్రెస్ అకాడమీ, ఏ.సి గార్డ్స్ 16వ తేదీన పంపిణీ చేయనున్నారు. ఈ సర్కిల్ లో మొత్తం 21,100 వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తారు.
కార్వాన్ సర్కిల్ లోని జియాగూడ, కార్వాన్, లంగర్ హౌస్, గోల్కొండ, టోలీచౌకి, నానాల్ నగర్ వార్డులలో జిహెచ్ఎంసి ద్వారా ఈ నెల 16, 17 తేదీలలో 15000 మట్టి విగ్రహాలు పంపిణీ చేయనున్నారు.
గోషామహల్ సర్కిల్ లోని బేగంబజార్, గోషామహల్, మంగళహాట్, దత్తాత్రేయ నగర్, జాంబాగ్, గన్ ఫౌండ్రీ వార్డు కార్యాలయాల్లో ఈ నెల 16,17 తేదీల్లో మొత్తం 15000 మట్టి విగ్రహాలు పంపిణీ చేయనున్నారు.
ఖైరతాబాద్ సర్కిల్ లో ఖైరతాబాద్, సోమాజిగూడ, అంబర్ పేట్, అమీర్పేట్, సనత్ నగర్ వార్డు కార్యాలయాల్లో ఈ నెల 16,17 జిహెచ్ఎంసి ద్వారా, అంతేకాకుండా హెచ్.ఎం.డి.ఏ ద్వారా హెచ్.ఎం.డి.ఏ ఆఫీస్, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్, అమీర్ పేట్, ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్, సోమాజిగూడ వార్డు పరిధిలో హెచ్.ఎం.డి.ఏ ద్వారా గ్రీన్ ల్యాండ్, నెక్లెస్ నోటరీ, కుందన్ బాగ్, బేగంపేట్ 15,16 తేదీల్లో హెచ్.ఎం.డి.ఏ, జిహెచ్ఎంసి కలిపి మొత్తం 15400 వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేయనున్నారు.
జూబ్లీహిల్స్ సర్కిల్ లోని వెంకటేశ్వర కాలనీ, బంజారాహిల్స్, షేక్ పేట్, జూబ్లీహిల్స్ వార్డు కార్యాలయాల్లో 15,600 మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తారు. అందులో హెచ్.ఎం.డి.ఏ ద్వారా వెంకటేశ్వర కాలనీలో రోడ్ నె.10 ఐ.ఏ.ఎస్ క్వార్టర్స్, కే.బీ.ఆర్ పార్కు మెయిన్ ఎంట్రెన్స్ లో ఈ నెల 15 తేదీన, మిగతా వార్డులలో జిహెచ్ఎంసి ద్వారా 16, 17 తేదీల్లో పంపిణీ చేస్తారు. మొత్తం ఖైరతాబాద్ జోన్ 80,100 వినాయక విగ్రహాల పంపిణీ చేస్తారు.
యూసుఫ్ గూడ సర్కిల్ లోని కొండాపూర్, గచ్చిబౌలి, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ, రహమత్ నగర్, బోరబండ వార్డులలో 12,500 మట్టి విగ్రహాలు పంపిణీ చేయనున్నారు.
శేరిలింగంపల్లి సర్కిల్ లోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి వార్డు కార్యాలయాల్లో మొత్తం 11,100 మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నారు. అందులో హెచ్.ఎం.డి.ఏ ద్వారా ఈ నెల 16వ తేదీన కొండాపూర్ లో పంపిణీ, శిల్పారామం, గచ్చిబౌలి మైహోం బూజా అపార్ట్ మెంట్, దుర్గం చెరువు, మైడ్ స్పేస్ జంక్షన్ లలో ఈ నెల 14వ తేదీ పంపిణీ చేయనున్నారు.
చందానగర్ సర్కిల్ లోని మాదాపూర్, హఫీజ్ పేట్, చందానగర్, మియాపూర్ వార్డు కార్యాలయాల్లో జిహెచ్ఎంసి ద్వారా పంపిణీ చేస్తారు. అదేవిధంగా హెచ్.ఎం.డి.ఏ ద్వారా ఎస్.ఎం.ఆర్. వినయ్, మైహోం జ్యూవెలరీస్ వద్ద ఈ నెల 16,17 మొబైల్ వాహనం ద్వారా మొత్తం 11,800 విగ్రహాలు పంపిణీ చేస్తారు.
రామచంద్రాపురం, పటాన్ చెరు సర్కిల్ లోని భారతీనగర్, ఆర్.సి పురం, పటాన్ చెరు వార్డు కార్యాలయాల్లో ఈ నెల 16,17 తేదీలలో 7,500 విగ్రహాలను పంపిణీ చేస్తారు. మొత్తం శేరిలింగంపల్లి జోన్ లో 42,900 విగ్రహాలను పంపిణీ చేస్తారని కమిషనర్ తెలిపారు.
మూసాపేట సర్కిల్ లో కె.పి.హెచ్.బి కాలనీ, బాలాజీ నగర్, అల్లాపూర్, మూసాపేట్, ఫతేనగర్ వార్డు కార్యాలయాల్లో జిహెచ్ఎంసి ద్వారా 16,17 తేదీల్లో హెచ్.ఎం.డి.ఏ ద్వారా హిందూ ఫార్చూన్ టవర్స్ కూకట్ పల్లి లో మొత్తం 14,300 విగ్రహాలను పంపిణీ చేయనున్నారు.
కూకట్ పల్లి సర్కిల్ లోని ఓల్డ్ బోయిన్ పల్లి, బాలానగర్, కూకట్ పల్లి, వివేకానంద నగర్ కాలనీ, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ వార్డు కార్యాలయాల్లో ఈ నెల 16, 17 తేదీల్లో హెచ్.ఎం.డి.ఏ ద్వారా మెట్రో క్యాచ్ అండ్ క్యారీ వద్ద 15,16 తేదీల్లో పంపిణీ చేస్తారు. ఈ సర్కిల్ లో మొత్తం 16,800 విగ్రహాలను పంపిణీ చేస్తారు.
కుత్బుల్లాపూర్ సర్కిల్ లోని రంగారెడ్డి నగర్, సుభాష్ నగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల వార్డు కార్యాలయాల్లో జిహెచ్ఎంసి ద్వారా ఈ నెల 16,17 తేదీల్లో మొత్తం 10,000 విగ్రహాలను పంపిణీ చేయనున్నారు.
గాజులరామారం సర్కిల్ లోని గాజులరామారం, చింతల్, జగద్గిరిగుట్ట, సూరారం వార్డు కార్యాలయాల్లో మొత్తం 10 వేల విగ్రహాలను ఈ నెల 16, 17 తేదీలలో పంపిణీ చేయనున్నారు.
అల్వాల్ సర్కిల్ లోని మచ్చ బొల్లారం, అల్వాల్, వెంకటాపురం వార్డులలో జిహెచ్ఎంసి ద్వారా 7,500 విగ్రహాలను పంపిణీ చేస్తారు. కూకట్ పల్లి జోనల్ మొత్తం 58,600 మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నారు.
మల్కాజ్ గిరి సర్కిల్ లోని నేరేడ్ మెట్, వినాయక నగర్, మౌలాలి, ఈస్ట్ ఆనంద్ బాగ్, మల్కాజ్ గిరి, గౌతం నగర్ వార్డులలో జిహెచ్ఎంసి ద్వారా ఈ నెల 16,17 తేదీలలో 16,800 విగ్రహాలను పంపిణీ చేయనున్నారు.
సికింద్రాబాద్ సర్కిల్ లోని అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సీతాఫల్ మండి, బౌద్దనగర్ వార్డులలో జిహెచ్ఎంసి ద్వారా ఈ నెల 16,17 తేదీలలో 14,300 విగ్రహాలు పంపిణీ చేయనున్నారు. ఇందులో హెచ్.ఎం.డి.ఏ ద్వారా తార్నాక కమర్షియల్ కాంప్లెక్స్ లో ఈ నెల 16వ తేదీన పంపిణీ చేయనున్నారు.
బేగంపేట సర్కిల్ లోని బేగంపేట్, బన్సిలాల్ పేట్, రాంగోపాల్ పేట్, మోండా మార్కెట్ వార్డులలో జిహెచ్ఎంసి ద్వారా, మోండా మార్కెట్ వార్డు పరిధిలో హెచ్.ఎం.డి.ఏ ద్వారా గణేష్ టెంపుల్ సికింద్రాబాద్ లలో మొత్తం 11,800 విగ్రహాలు ఈ నెల 16, 17 తేదీల్లో పంపిణీ చేయనున్నారు.
అంబర్ పేట్ సర్కిల్ లోని హిమాయత్ నగర్, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్ పేట్, బాగ్ అంబర్ పేట్ వార్డులలో, కాచిగూడ వార్డు పరిధిలో హెచ్.ఎం.డి.ఏ ద్వారా నారాయణగూడ పార్కు వద్ద ఈ నెల 16, 17 తేదీల్లో 16,800 విగ్రహాలను పంపిణీ చేయనున్నారు.
ముషీరాబాద్ సర్కిల్ లోని అడిక్ మెట్, ముషీరాబాద్, రాంనగర్, బోలక్ పూర్, గాంధీ నగర్, కవాడిగూడ వార్డులలో, కవాడిగూడ వార్డు పరిధిలో హెచ్.ఎం.డి.ఏ ద్వారా ట్యాంక్ బండ్ వద్ద ఈ నెల 15వ తేదీ, జిహెచ్ఎంసి ద్వారా వార్డు కార్యాలయాల్లో ఈ నెల 16, 17 తేదీల్లో 16,800 విగ్రహాలు పంపిణీ చేయనున్నారు. మొత్తం సికింద్రాబాద్ జోన్ లో 76,500 మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తారని కమిషనర్ తెలిపారు.
మొత్తం ఈ పంపిణీ ప్రక్రియలో జిహెచ్ఎంసి ద్వారా 1.5 ఫీట్ల మట్టి విగ్రహాలు 10వేలు, 1 ఫీట్ 30 వేలు, 8 ఇంచ్ ల విగ్రహాలు 2,70,000 విగ్రహాలు, అదే విధంగా హెచ్.ఎం.డి.ఏ ద్వారా 8 ఇంచ్ ల విగ్రహాలు 79,200, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా 8 ఇంచ్ ల విగ్రహాలు 75,000 విగ్రహాలు పంపిణీ చేయనున్నారు. మరో 46 వేల మట్టి విగ్రహాలను జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ ద్వారా ఆయా ప్రదేశాల్లో పంపిణీ చేయనున్నారు. మొత్తం వార్డు ఆఫీస్ ల ద్వారా పంపిణీ చేసే మట్టి విగ్రహాలు జిహెచ్ఎంసి, హెచ్.ఎం.డి.ఏ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు కలుపుకుని మొత్తం 4,64,200 మట్టి విగ్రహాలను జిహెచ్ఎంసి పరిధిలో పంపిణీ చేస్తామని కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం