ఈ మధ్య కాలంలో అగ్ని ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే, ఇతర కారణాల వల్లనో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం పంజాగుట్ట ఎర్రమంజిల్‌లోని ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.
6వ అంతస్తులో మంటల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకు ఆరుగురిని కాపాడారు. ఇంకా మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చేపడుతున్నారు. మంటలను అదుపులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా? లేదా గ్యాస్ సిలిండర్ లీక్ కారణమా? అనేది తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి