Watch Video: వామ్మో.. మరోసారి మూసీ నదిలో మొసలి ప్రత్యక్షం.. ఎక్కడో తెలుసా?

హైదరాబాద్‌లోని మూసి పరివాహక ప్రాంతాల్లో మరోసారి మొసలి ప్రత్యక్షమవడం తీవ్ర కలకలం రేపింది. లంగర్‌హైస్‌ సమీపంలోని మూసీ నదిలో ఆడుకుంటున్న కొందరు పిల్లలకు ఆదివారం సాయంత్రం సడెన్‌గా మొసలి కనిపించింది. దీంతో భయపడిపోయిన పిల్లలు ఈ విషయాన్ని వెంటనే స్థానికులకు చెప్పడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Watch Video: వామ్మో.. మరోసారి మూసీ నదిలో మొసలి ప్రత్యక్షం.. ఎక్కడో తెలుసా?
Crocodile Found At Hyd

Updated on: Aug 17, 2025 | 10:58 PM

హైదరాబాద్‌లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో మరోసారి మొసలి ప్రత్యక్షమవడం తీవ్ర కలకలం రేపింది. లంగర్‌హైస్ ప్రాంతంలోని మూసీ నది ఒడ్డున ఉన్నట్టుండి ఒక మొసలి ప్రత్యక్షమైంది. ఆదివారం సాయంత్రం నది ఒడ్డును ఆడుకుంటున్న కొందరు పిల్లల ఈ మొసలిని గుర్తించారు. నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద బండరాయిపై మొసలి ఉండడాన్ని చూసి పిల్లలు భయపడిపోయి వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. వెంటనే ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్థానికులంతా అక్కడికి చేరుకొని మొసలి చూసేందుకు ఎగబడ్డారు.

కొందరు మొసలికి రాయిపై కదులుతున్న వీడియోలను తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో కాస్తా వైరల్‌ అయ్యాయి. మరోవైపు మొసలి సంచరిస్తున్న విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పిల్లలను భయటకు పంపాలంటేనే భయపడుతున్నారు. ఇక ఈ విషయాన్ని స్థానికులు అట‌వీశాఖ అధికారుల‌కు, పోలీసుల‌ దృష్టికి తీసుకెళ్లారు.

ఇదిలా ఉండగా ఈ సీజ‌న్‌లో మొస‌లి క‌నిపించ‌డం ఇది మూడోసారి అని స్థానికులు పేర్కొన్నారు. గతంలో కూడా కిష‌న్‌బాగ్ సమీపంలోని అస‌ద్ బాబాన‌గ‌ర్‌, చైత‌న్యపురి వద్ద మూసీ న‌దిలో మొస‌ళ్లు కనిపించాయి. అయితే గత వారంలో రోజులుగా కురుస్తున్న వర్షాలతో హిమాయ‌త్ సాగ‌ర్ భారీగా వరద పొట్టెత్తింది. దీంతో ఇటీవలే డ్యాం గేట్లు కూడా తెరిచారు. దీంతో న‌దిలో మొస‌ళ్ల వరదతో పాటు కొట్టుకొని వచ్చి ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండిగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.