Hyderabad: సీపీ సజ్జనార్ పర్సనల్, ప్రొఫెషనల్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటో తెలుసా..?

నూతన సంవత్సరం సందర్భంగా తన ప్రొఫెషనల్, పర్సనల్ సంకల్పాలను ప్రజలతో పంచుకున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్… నగరాన్ని మరింత సేఫ్‌గా తీర్చిదిద్దడమే తన ప్రాధాన్యమని స్పష్టం చేశారు. సైబర్ క్రైమ్‌పై కఠిన చర్యలు, పోలీస్ సిబ్బంది సంక్షేమం, ఫిట్‌నెస్‌పై ఫోకస్‌తో 2026కి కొత్త కమిట్‌మెంట్ తీసుకున్నారు.

Hyderabad: సీపీ సజ్జనార్ పర్సనల్, ప్రొఫెషనల్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటో తెలుసా..?
CP Sajjanar

Edited By:

Updated on: Jan 02, 2026 | 4:41 PM

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో శాంతి భద్రతల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై చివరి వరకు ఫోకస్‌తో పనిచేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఈ ప్రక్రియలో తనతో పాటు నిబద్ధతతో విధులు నిర్వహించిన పోలీస్ బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తన వ్యక్తిగత, వృత్తిపరమైన రిజల్యూషన్స్ ప్రజలతో పంచుకున్న సజ్జనార్, బాధ్యతలు-జీవితం మధ్య బ్యాలెన్సే అసలైన విజయమని పేర్కొన్నారు. పోలీస్ అధికారిగా నగరాన్ని మరింత సేఫ్‌గా, సెక్యూర్‌గా, గ్లోబల్ స్టాండర్డ్స్‌కు దగ్గరగా తీసుకెళ్లడమే తన ప్రాధమిక లక్ష్యమని స్పష్టం చేశారు. సేవ అనేది ఒక టైమ్‌బౌండ్ డ్యూటీ కాదని, ప్రతిరోజూ రీన్యూ చేసుకునే కమిట్‌మెంట్ అని వ్యాఖ్యానించారు. ప్రజల భద్రతే తన టాప్ ప్రైయారిటీ అని తెలిపారు.

రాబోయే ఏడాదిలో సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ స్కామ్స్, కొత్త తరహా నేరాలపై అవగాహన పెంచడంపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్లు వెల్లడించారు. టెక్నాలజీ ఆధారిత నేరాలను కఠిన చర్యలు, స్ట్రాంగ్ ఎన్ఫోర్స్‌మెంట్ ద్వారా అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. అలాగే పోలీస్ సిబ్బంది హెల్త్, వెల్‌బీయింగ్ కూడా అంతే ముఖ్యమని సజ్జనార్ పేర్కొన్నారు. ఫిజికల్‌గా ఫిట్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న ఫోర్స్‌నే ఎఫెక్టివ్ పోలీసింగ్‌కు ఫౌండేషన్ అని తెలిపారు. సిబ్బంది సంక్షేమం ఎప్పటికీ తన ప్రాధాన్యాల్లో ఉంటుందని స్పష్టం చేశారు. బిజీ షెడ్యూల్ మధ్య కూడా చదువు, నిరంతర లెర్నింగ్‌కు టైమ్ కేటాయించాలని ఈ ఏడాది నిర్ణయించుకున్నట్లు చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా స్కిల్స్ అప్డేట్ చేసుకోవడం ప్రతి ప్రొఫెషనల్‌కు అవసరమని అభిప్రాయపడ్డారు.

ఇక వ్యక్తిగతంగా కుటుంబం, స్నేహితులతో క్వాలిటీ టైమ్ గడపాలని ఈ ఏడాది ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నట్లు తెలిపారు. వారి సపోర్ట్ వల్లే ప్రజాసేవలో పూర్తిగా కమిట్ కావడం సాధ్యమవుతోందని పేర్కొంటూ, కుటుంబమే తన అసలైన బలమని అన్నారు. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేందుకు సస్టైనబుల్ రూటీన్‌ను ఫాలో అవుతానని చెప్పిన సజ్జనార్, “ఈ ఏడాది నిజంగా జిమ్‌లో కూడా జాయిన్ అవుతా” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. చివరగా ప్రజలందరికీ సేఫ్, హెల్తీ, మీనింగ్‌ఫుల్ నూతన సంవత్సరం కావాలని శుభాకాంక్షలు తెలిపారు.