Hyderabad: నీచుడి ఆకృత్యం.. గందరగోళంగా 700 మంది విద్యార్ధుల చదువు.. ఆప్షన్స్ ఏంటి?

|

Oct 22, 2022 | 9:30 PM

ఒక్కడు.. ఒకే ఒక్కడు చేసిన ఆకృత్యానికి ఇప్పుడు 700 మంది విద్యార్ధుల చదువు గందరగోళంగా మారింది. DAV స్కూల్ విషయంలో ఇప్పుడు విద్యాశాఖ ఏం చేయబోతోంది? విద్యార్ధులకు ఉన్న ఆప్షన్స్ ఏంటి? పేరంట్స్ డిమాండ్స్ ఏంటి?

Hyderabad: నీచుడి ఆకృత్యం.. గందరగోళంగా 700 మంది విద్యార్ధుల చదువు.. ఆప్షన్స్ ఏంటి?
REPRESENTATIVE IMAGE
Follow us on

బంజారాహిల్స్ DAV స్కూల్‌లో జరిగిన ఘటనపై సర్కార్ సీరియస్‍‌గా యాక్షన్ తీసుకుంటోంది. నిందితులను అరెస్ట్ చేయడమే కాకుండా.. స్కూల్ పర్మీషన్‌ను కూడా రద్దుచేసింది. కానీ ఈ శిక్ష.. మేనేజ్‌మెంట్‌కా.. లేక విద్యార్ధులకా?. ఒక్కసారి స్కూల్‌కి లాక్ పడటంతో ఏకంగా 700 మంది విద్యార్ధులు.. పలక, బలపం పట్టుకుని రోడ్డు మీద నిలబడ్డారు. వాళ్లు ఇప్పుడు ఏస్కూలుకు వెళ్లాలి? మళ్లీ ఎక్కడ నుంచి మొదలుపెట్టాలనే కన్ఫ్యూజన్. స్కూల్ రీఓపెన్‌ చేసేదిలేదని తేల్చి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. విద్యార్థుల్ని వేరే స్కూల్‌కి పంపేందుకు ప్రపోజల్‌ పెట్టింది. ఒక CBSE స్కూల్‌తో పాటు.. 8 స్టేట్‌ సిలబస్‌ స్కూళ్లతో ఇప్పటికే అంగీకారం కుదిరింది. కానీ అకడమిక్ ఇయర్ మధ్యలో పిల్లల్ని వేరే స్కూల్‌కి పంపడానికి పేరంట్స్ ఇష్టపడటం లేదు. అటు యాజమాన్యం కూడా స్కూల్ రీఓపెన్ చేయాలని విజ్ఞప్తి చేస్తోంది.

విద్యార్ధుల కోసం తెలంగాణ విద్యాశాఖ మూడు ఆప్షన్లు ఇచ్చింది. వాటిలో ఏ ఆప్షన్ ఎంచుకోవాలో అర్ధం కాక.. విద్యార్ధులతో పాటు వాళ్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. స్కూల్‌ను రీఓపెన్ చేయాలని మరికొందరు రిక్వెస్ట్ చేస్తున్నారు. లేదంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అదే స్కూల్ రన్ చేస్తే బాగుంటుంది.. పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటారని మరికొంత మంది స్టూడెంట్స్ పేరంట్స్ అభిప్రాయపడుతున్నారు. DAVకి సంబంధించిన మిగిలిన బ్రాంచ్‌లకు పిల్లలను సర్దుబాటు చేయాలని మరికొందరి రిక్వెస్ట్.

మరోవైపు DAV స్కూల్‌ నిందితులను 5రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై వచ్చే సోమవారం కోర్టులో విచారణ జరగనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..