
హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్ప జంక్షన్ సమీపంలో బుధవారం రాత్రి షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నడి రోడ్డు పై ఓ కార్ తగలబడింది. రన్నింగ్‌లో ఉన్న మహేంద్ర ఎక్స్‌యూవి కారు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడాన్ని డ్రైవర్ గుర్తించాడు. వెంటనే అప్రమత్తమై వాహనాన్ని పక్కకు ఆపి కిందకు దిగాడు. అంతలోనే పొగలు కాస్త మంటలుగా మారీ కారు మొత్తం వ్యాపించాయి. అలా చూస్తుండగానే కారు మొత్తం మంటల్లో కాలిపోయింది.
స్థానిక వాహనదారుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటలను అదుపు చేశారు. పూర్తిగా కాలిపోయి రోడ్డుపై ఉన్న కారును క్రెయిన్ సహాయంతో పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అయితే ఈ ప్రమాదానికి టెక్నికల్ లోపాలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల విద్యుత్ వ్యవస్థలో షార్ట్ సర్క్యూట్, ఇంజన్ ఓవర్‌హీటింగ్ లేదా ఫ్యూయల్ సిస్టమ్ లోపాలే ఇలాంటి ప్రమాదాలకు ముఖ్య కారణమవుతాయని అంటున్నారు.
గత కొంతకాలంగా హై ఎండ్ వాహనాల్లో ఎలక్ట్రికల్ వైరింగ్ సమస్యలు తరచూ తలెత్తుతున్నాయి. ఇది సరైన పరిశీలన లేకపోవడం వల్ల జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. డ్రైవర్ త్వరగా స్పందించడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. కాబట్టి వాహనదారులు రెగ్యులర్‌గా సర్వీసింగ్ చేయించుకోవాలని.. ముఖ్యంగా ఎలక్ట్రికల్ భాగాలు పరీక్షించాలి. పొగలు లేదా అసాధారణ శబ్దాలు కనిపిస్తే వెంటనే ఆపి ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు తగ్గడానికి పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెబతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి