Hyderabad Company: 18 గంటల్లో 28 కిలోమీటర్ల రోడ్డు పూర్తి.. సరికొత్త రికార్డ్ సృష్టించిన హైదరబాద్ నిర్మాణ సంస్థ..

|

Mar 03, 2021 | 8:18 PM

Hyderabad Construction Company: రోడ్డు నిర్మాణ పనుల్లో హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న నిర్మాణ సంస్థ ఐజెఎం(ఇండియా) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్..

Hyderabad Company: 18 గంటల్లో 28 కిలోమీటర్ల రోడ్డు పూర్తి.. సరికొత్త రికార్డ్ సృష్టించిన హైదరబాద్ నిర్మాణ సంస్థ..
Follow us on

Hyderabad Construction Company: రోడ్డు నిర్మాణ పనుల్లో హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న నిర్మాణ సంస్థ ఐజెఎం(ఇండియా) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఐజెఎంఐఐ) సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 18 గంటల్లోపే 25.54 కిలోమీటర్ల సింగిల్ లేన్ రోడ్డును పూర్తి చేసి దేశ నిర్మాణ రంగంలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. సోలాపూర్-బీజాపూర్ మధ్య గల హైవే నెంబర్ 13 రోడ్డు విస్తరణ పనులు జరగుతుండగా.. ఈ పనుల్లో ఐజెఎంఐఐ ఈ ఫీట్‌ను సాధించింది. జాతీయ రహదారి ప్రాజెక్టులో భాగంగా ఇంత స్పీడ్‌గా రోడ్డును నిర్మించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ఫీట్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్రవేశించడానికి మార్గం సుగమం చేస్తుందని కంపెనీ భావిస్తోంది.

కాగా, మలేషియాకు చెందిన ఐజెఎం కన్స్ట్రక్షన్ బెర్హాద్ అనుబంధ సంస్థ ఐజెఎం ఇండియా, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఐఐ) అధికారులు ఈ ప్రాజెక్టును అత్యంత త్వరగా పూర్తి చేయడం పట్ల కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి సహకరించిన ఉద్యోగులందరినీ నితిన్ గడ్కరీ అభినందించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన నితిన్ గడ్కరీ.. ఈ రోడ్డు నిర్మాణ పనులు ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో నమోదు చేయబడుతుందని పేర్కొన్నారు.

“కాంట్రాక్టర్ సంస్థకు చెందిన 500 మంది ఉద్యోగులు ఈ రోడ్డు నిర్మాణం కోసం చాలా కష్టపడ్డారు. ఆ ఉద్యోగులతో సహా జాతీయ రహదారుల అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్లు, అధికారులు, కాంట్రాక్టర్ కంపెనీ ప్రతినిధులు, ప్రాజెక్ట్ అధికారులను నేను అభినందిస్తున్నాను ”అని మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. అలాగే “ప్రస్తుతం 110 కిలోమీటర్ల సోలాపూర్-విజయపూర్ రహదారి పురోగతిలో ఉంది, ఇది అక్టోబర్ 2021 నాటికి పూర్తవుతుంది” అని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు ఐజేఎంఐఐ ప్రాజెక్టు టీమ్ లీడర్ ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. భారీ రహదారి నిర్మాణ పనులను చేపట్టడంలో రవాణా, సాంకేతిక పరమైన సవాళ్లు ఉన్నాయని, అయినప్పటికీ వాటన్నింటినీ ఎదుర్కొని కేవలం 18 గంటల్లోనే రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు.

Nitin Gadkari Tweet:

Also read:

సంపన్నుల జాబితాలో హైదరాబాద్ ఫార్మా దిగ్గజాలు.. గ్లోబల్ బిలియనీర్ క్లబ్‌లో 10 మందికి చోటు.. ఎవరెవరంటే..

ఏపీలో ముగిసిన మున్సిపల్ నామినేషన్ల పర్వం.. 2వేలకు పైగా వార్డులు ఏకగ్రీవం.. పురపోరులోనూ సత్తా చాటిన వైఎస్సార్‌సీపీ