Hyderabad: ఇలా ఎలారా.! హైవేపై దూసుకొస్తున్న ఫోర్డ్ కారు.. ఆపి చెక్ చేయగా కళ్లు చెదిరేలా..

|

May 04, 2024 | 11:00 AM

మరో 10 రోజులు.. రాష్ట్రమంతా ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఒకపక్క క్యాండిడేట్లు ఎన్నికల తాయిలాలను ప్రజల కోసం రహస్యంగా తరలిస్తుంటే.. మరోపక్క స్మగ్లర్లు యదేచ్చగా తమ అక్రమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఈ కోవలోనే పోలీసుల కళ్లుగప్పి.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

Hyderabad: ఇలా ఎలారా.! హైవేపై దూసుకొస్తున్న ఫోర్డ్ కారు.. ఆపి చెక్ చేయగా కళ్లు చెదిరేలా..
Representative Image
Follow us on

మరో 10 రోజులు.. రాష్ట్రమంతా ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఒకపక్క క్యాండిడేట్లు ఎన్నికల తాయిలాలను ప్రజల కోసం రహస్యంగా తరలిస్తుంటే.. మరోపక్క స్మగ్లర్లు యదేచ్చగా తమ అక్రమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఈ కోవలోనే పోలీసుల కళ్లుగప్పి.. సుమారు 6 కిలోల బంగారాన్ని అక్రమంగా నగరంలోకి తరలించేందుకు ప్రయత్నించిన కేటుగాళ్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి దగ్గర నుంచి దాదాపు రూ. 4.31 కోట్లు విలువ చేసే 6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన చౌటుప్పల్‌లోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద గురువారం జరిగింది.

విజయవాడ-హైదరాబాద్ హైవే మార్గంలో బంగారం, నగదును అక్రమంగా తరలిస్తున్న వాహనాలను ట్రాక్ చేసింది డీఆర్ఐ. గురువారం చౌటుప్పల్‌లోని లింగోజీగూడ పంతంగి టోల్​ప్లాజా వద్ద కోల్‌కతా నుంచి నలుగురు వ్యక్తులతో వెళుతున్న ఫోర్డ్​ఎకో స్పోర్ట్స్​కారును ఆపారు అధికారులు. వాహనంలోని నలుగురు వ్యక్తులను ప్రశ్నించగా.. పొంతలేని సమాధానాలు చెప్పడంతో.. లోపల వాహనాన్ని అంతా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇక వారికి షాక్ అయ్యేలా 35 బంగారు కడ్డీలు ముక్కలు కారు డ్యాష్ బోర్డులో దొరికాయి. వాటి బరువు సుమారు 5.964 కిలోలు ఉండగా.. విలువ రూ.4.31 కోట్లు ఉంటుందని అంచనా. కాగా, ఆ నలుగురిని 1962 కస్టమ్స్​ చట్టంలోని నిబంధనలు ప్రకారం అరెస్ట్ చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.