
హైదరాబాద్ మహానగరానికి ప్రధానంగా మంజీరా, సింగూర్ ప్రాజెక్టు నుంచి భారీ మొత్తం త్రాగునీరు సరఫరా జరుగుతుంది. అయితే సింగూర్ ప్రాజెక్టులో పెద్దపూర్ నుంచి సింగపూర్ వరకు ఉన్న 1,600 MM డయా ఫేజ్ – 3 మెయిన్ పైప్‌లైన్‌లో భారీ లీకేజీలు ఏర్పడినట్టు అధికారులు గుర్తించారు. దీంతో అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టాలని నిర్ణయించారు. దీనితో పాటు, టిఎస్ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో 132కేవీ కంది సబ్‌స్టేషన్ వద్ద పెద్దపూర్ ఫీడర్‌కు సంబంధించి ఏంఆర్ టి టెస్టింగ్, హాట్ లైన్ రిమార్క్స్ లతో పాటు సాధారణ నిర్వహణ పనులు నిర్వహించనున్నారు. ఈ పనులు 03.01.2026, శనివారం ఉదయం 10 గంటల నుంచి తేదీ 04.01.2026 తెల్లవారుజామున 4 గంటలకు చేపడతారు.
ఈ కారణంగా నగరంలోని క్రింది పేర్కొన్న ప్రాంతాలకు సూచించిన తేదీలలో 18 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేయబడుతుందని.. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.