HMDA Land Auction : కోకాపేట వంతు ముగిసింది. ఇప్పుడు బుద్వేల్‌ తెరపైకొచ్చింది.. ఎప్పుడంటే..?

|

Aug 04, 2023 | 9:06 PM

కోకాపేట వంతు ముగిసింది. ఇప్పుడు బుద్వేల్‌ తెరపైకొచ్చింది. కోకాపేట భూములు కాసుల వర్షం కురిపించడంతో మరో వేలానికి రెడీ అయ్యింది తెలంగాణ ప్రభుత్వం. మరి, కోకాపేట రికార్డును బుద్వేల్‌ బ్రేక్‌ చేస్తుందా! హైదరాబాద్ పేరు మరోసారి దేశం మొత్తం మోగుతుందా!. ఇంతకీ బుద్వేల్‌ భూముల వేలం ఎప్పుడు.? అధికారులు ఏం చెబుతున్నారు. ఆ పూర్తి డిటైల్స్‌ను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

HMDA Land Auction : కోకాపేట వంతు ముగిసింది. ఇప్పుడు బుద్వేల్‌ తెరపైకొచ్చింది.. ఎప్పుడంటే..?
Budwel Layout
Follow us on

హైదరాబాద్, ఆగస్టు 4: భూములు కావవి…ఖజానా నింపే అక్షయపాత్రలు!. అవును, హైదరాబాద్‌ భూములు బంగారు గనుల్లా మారిపోయాయి. అందుకే, భాగ్యనగర భూములను దక్కించుకునేందుకు క్యూ కడుతున్నాయి బడాబడా కంపెనీలు. కోకాపేటలో ఎకరం భూమి ధర వందకోట్లపైనే పలకడం దేశం మొత్తం రీసౌండ్ వస్తోంది. ఒక్క దేశమే కాదు, ప్రపంచం మొత్తం హైదరాబాద్‌ గురించే మాట్లాడుకునేలా చేశాయ్‌ కోకాపేట భూములు. కోకాపేట ల్యాండ్స్ డబ్బుల వర్షం కురిపించడంతో, అదే స్పీడ్‌లో మరో వెంచర్‌ను వేలానికి రెడీ చేసింది సర్కార్. హైదరాబాద్‌ శివార్లలోని బుద్వేల్‌లో 100 ఎకరాల ఆక్షన్‌ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనెల పదో తేదీన ఈ భూముల వేలం జరగనుంది. రెండు సెషన్లలో 100 ఎకరాలకు ఆక్షన్‌ నిర్వహించనుంది HMDA. మార్నింగ్‌ సెషన్‌లో 1, 2, 4, 5, 8, 9, 10 ప్లాట్లకు…. మధ్యాహ్నం తర్వాత 11, 12, 13, 14, 15, 16, 17 ప్లాట్లకు వేలం జరుగుతుంది. ఇక్కడ ఎకరం కనీస ధరను 20కోట్ల రూపాయలుగా నిర్ణయించింది ప్రభుత్వం. ఆక్షన్‌ రిజిస్ట్రేషన్ల కోసం ఈనెల 8వ తేదీ సాయంత్రం 5గంటల వరకు అవకాశం కల్పించింది.

బుద్వేల్‌ లేఅవుట్‌లో మొత్తం 14 ప్లాట్స్‌ ఉన్నాయ్‌. ఈ ప్లాట్లను సెవెన్‌ ప్లస్‌ సెవెన్‌గా విభజించింది HMDA. సగం ప్లాట్లకు ఉదయం, మిగతా ప్లాట్లకు సాయంత్రం వేలం జరుగుతుంది. అయితే, ఏ ప్లాట్‌లో ఎంత భూమి ఉంది అంటే!. ప్లాట్‌ నెంబర్‌-1లో 5.10 ఎకరాలు, టూలో 8.15 ఎకరాలు, ఫోర్‌లో 14.33 ఎకరాలు, ఫైవ్‌లో 10.59 ఎకరాలు, 8లో 6.31 ఎకరాలు, నైన్‌లో 6.69 ఎకరాలు, టెన్‌లో 6.94 ఎకరాల భూమి ఉంది. ఇక, సెకండ్‌ సెషన్‌లో వేలం జరిగే …ప్లాట్‌ నెంబర్‌11లో 6.92 ఎకరాలు, పన్నెండులో 6.69 ఎకరాలు, పదమూడులో 6.94 ఎకరాలు, పద్నాలుగులో 6.13 ఎకరాలు, 15లో 7.16 ఎకరాలు, పదహారులో 3.47 ఎకరాలు, 17లో 4.59 ఎకరాల భూమిని ఆక్షన్‌ వేయనుంది HMDA.

కోకాపేట ల్యాండ్స్‌ రికార్డు ధర పలకడంతో, బుద్వేల్‌ భూములు కూడా కాసుల వర్షం కురిపిస్తాయని భావిస్తోంది సర్కార్‌. ఎందుకంటే, కోకాపేట భూముల్లో చేసినట్టే బుద్వేల్‌ లేఅవుట్‌లో కూడా వందల కోట్ల రూపాయలతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌ చేసింది HMDA. వరల్డ్‌ క్లాస్‌ ఫెసిలిటీస్‌తో మౌలిక సదుపాయాలు కల్పించింది. దాంతో, బుద్వేల్‌ భూముల కోసం బడా కంపెనీలు క్యూ కడతాయనుకుంటోంది ప్రభుత్వం. మరి, కోకాపేట రికార్డును బుద్వేల్‌ బ్రేక్‌ చేస్తుందా!. సరికొత్త రికార్డులు సృష్టిస్తుందా లేదా చూడాలి!.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.