నగరంలో భారీ వర్షం..

నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజరాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్ పల్లి, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, ఈసీఐఎల్, సుచిత్ర పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఉదయం నుంచి పలుమార్లు వర్షం పడుతూనే ఉంది. భారీ వర్షం పడటంతో.. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, రాత్రి భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ […]

నగరంలో భారీ వర్షం..

Edited By:

Updated on: Jul 31, 2019 | 7:49 PM

నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజరాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్ పల్లి, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, ఈసీఐఎల్, సుచిత్ర పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఉదయం నుంచి పలుమార్లు వర్షం పడుతూనే ఉంది. భారీ వర్షం పడటంతో.. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, రాత్రి భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.