హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం నుంచి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అబిడ్స్, కోఠి, సుల్తాన్‌బజార్, నాంపల్లి, బషీర్‌బాగ్, అంబర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్, తిరుమలగిరి, ఆల్వాల్ ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.