Rains: వానలతో తడిసి ముద్దవుతున్న తెలుగు రాష్ట్రాలు.. మరో మూడు రోజులూ ఇదే పరిస్థితి

|

Jun 28, 2022 | 3:14 PM

రాగల మూడు రోజులు తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్ లలో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్లు ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విజయనగరం, విశాఖపట్నం,...

Rains: వానలతో తడిసి ముద్దవుతున్న తెలుగు రాష్ట్రాలు.. మరో మూడు రోజులూ ఇదే పరిస్థితి
Ap Weather Alert
Follow us on

రాగల మూడు రోజులు తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్ లలో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్లు ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, యానాం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాయలసీమలో (Andhra Pradesh) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల మీదుగా బంగాళాఖాతం వరకు 1,500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. వర్షాలు కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేసింది.

కాగా.. హైదరాబాద్ లో ఆదివారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ప్రధానంగా శివారు ప్రాంతాల్లో భారీగా వాన పడుతోంది. వర్షం వల్ల ఇవాళ ఉదయాన్నే కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..