Hyderabad: తడిసి ముద్దయిన భాగ్యనగరం.. హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం.. ట్రాఫిక్‌ కష్టాలు..

Hyderabad: ఒకరోజు వర్షాలు తగ్గాయని అనుకునేంతలోపే మళ్లీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా మారడంతో రాత్రి 9 గంటల తర్వాత...

Hyderabad: తడిసి ముద్దయిన భాగ్యనగరం.. హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం.. ట్రాఫిక్‌ కష్టాలు..

Updated on: Jul 17, 2022 | 10:44 PM

Hyderabad: ఒకరోజు వర్షాలు తగ్గాయని అనుకునేంతలోపే మళ్లీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా మారడంతో రాత్రి 9 గంటల తర్వాత వర్షం కురవడం ప్రారంభమైంది. నగరంలోని దాదాపు అన్ని చోట్ల వర్షం కురుస్తోంది. షేక్‌పేట, గోల్కోండ, టోలీచౌకీ, గచ్చిబౌలి, మాదాపూర్, లింగం పల్లిలో వర్షం భారీ వర్షం కురుస్తోంది.

వీటితో పాటు మెహదీపట్నం, మాసబ్‌ ట్యాంక్‌, లక్డీకపూల్‌, బంజారాహిల్స్‌లోనూ వర్షం కురిసింది. భారీ వర్షంతో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల రోడ్లపై భారీగా వాన నీరు చేరింది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అలర్ట్‌ అయ్యారు. వర్షాల కారణంగా నగర వ్యాప్తంగా నాలాలు పొంగిపొర్లాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసం అయ్యాయి. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఒడిశా తీరం.. దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం.. వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరంలోనూ కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో.. ఆవర్తనం ఆవరించి ఉందని చెప్పారు. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అధికారులు తెలిపిరు. పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..