HYD Rains: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం..పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం!

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండ వేడికి ఉక్కరిబిక్కిరి అవుతున్న నగరవాసులను వరుణుడు చల్లబర్చాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడి భారీ వర్షం కురిసింది. వర్ష కారణంగా పలు ఏరియాల్లో రోడ్లపైకి భారీగా నీరు చేరాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

HYD Rains: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం..పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం!
Heavy Rain In Hyderabad

Updated on: Apr 18, 2025 | 6:45 PM

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండ వేడితో ఉక్కరిబిక్కిరి అవుతున్న నగరవాసులను వరుణుడు చల్లబర్చాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మసబ్ ట్యాంక్, మెహిదీపట్నం, అమీర్‎పేట్, యూసఫ్‎గూడ, క్రిష్ణానగర్, పంజాగుట్ట, బేగంపేట్, ఎర్రగడ్డ, కూకట్‎పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్ల, పరిసర ప్రాంతాల్లో వాన హోరెత్తిస్తుంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. మణికొండ, నార్సింగ్, బండ్లగూడ, నానక్‌రామ్‌ గూడ, కోకాపేట్‌లో వర్షం దంచి కొట్టింది. భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు వీయడంతో అమాంతంగా ఉన్న రేకుల షెడ్లు, చెట్లు, కరెంట్‌ పోల్స్‌ విరిగి పడుతున్నాయి. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. సాయంత్రం ఆఫీస్‌లు వదిలే సమయం కావడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

మరో పక్క నగరంలో భారీ వర్షాల పట్ల జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాల కారణంగా విరిగి పడే, చెట్లు, కరెంట్‌ పోల్స్‌ను పునరుద్దరిస్తున్నారు. రోడ్లపై భారీగా నీళ్లు చేరే ప్రాంతాల్లో నీటిని తొలగిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…