Crime News : భారీగా పట్టుబడిన గంజాయి.. కొత్త సంవత్సరం కోసం సిద్ధం చేస్తున్న మత్తుబాబులు..
న్యు ఇయర్ వచ్చేస్తుంది.. మరో మూడు రోజుల్లో కొత్తసంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి అంతా సిద్దమయ్యరు. ఇదే సమయంలో మత్తులో..
న్యు ఇయర్ వచ్చేస్తుంది.. మరో మూడు రోజుల్లో కొత్తసంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి అంతా సిద్దమయ్యరు. ఇదే సమయంలో మత్తులో మునగడానికి మరికొందరు రెడీ అవుతున్నారు. అలాంటి వారికోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ట్ స్టేషన్ పరిధిలోని మహాదేవపురంలో భారీగా గంజాయి, బంగ్, హుక్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో ఓ యువకుడినిపోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గరనుంచి 400 గ్రాముల గంజాయి, బంగ్, హుక్కా పాట్ లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. న్యూ ఇయర్ వేడుకలకోసం ఈ మత్తు పదార్థాలు సిద్డంచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.