
అదుపులేని వేగం మృత్యుపాశం అయింది. అసలే సింగిల్ రోడ్డు.. ఆపై మలుపు. దీనికి వేగం తోడయింది. ఈ క్రమంలోనే.. ఎదురుగా వస్తున్న లారీని అతి వేగంతో ఢీకొట్టింది కారు.. దీంతో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.. మరొకరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్ నగర పరిధిలోని హయత్ నగర్ కంట్లూరులో చోటుచేసుకుంది.
చనిపోయినవారిని చంద్రసేనారెడ్డి, త్రినాద్ రెడ్డి, వర్షిత్ రెడ్డిగా గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్నవారంతా అదే గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించిన.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి పంపించారు.
బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. మరికొన్ని సెకన్లలో ఇంటికి చేరుతారనగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. దీంతో కంట్లూరులో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి..
కాగా.. హయత్‌నగర్ కుంట్లూరులో రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ షాకింగ్‌గా మారింది. ఎదురుగా వస్తోన్న DCMను కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.. దీంతో కారులో మృతదేహాలు ఇరుక్కపోయాయి.. అయితే.. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను స్థానికులు అతి కష్టం మీద బయటికు తీశారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..