Hanuman Shobha Yatra: కొనసాగుతున్న హనుమాన్‌ శోభయాత్ర.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

|

Apr 16, 2022 | 1:49 PM

Hanuman Shobha Yatra: హనుమాన్‌ జయంతి సందర్భంగా వీరహనుమాన్‌ శోభయాత్ర హైదరాబాద్‌ నగరంలో ఘనంగా ప్రారంభమైంది. గౌలిగూడ రామమందిరం..

Hanuman Shobha Yatra: కొనసాగుతున్న హనుమాన్‌ శోభయాత్ర.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
Hanuman Shobha Yatra
Follow us on

Hanuman Shobha Yatra: హనుమాన్‌ జయంతి సందర్భంగా వీరహనుమాన్‌ శోభయాత్ర హైదరాబాద్‌ నగరంలో ఘనంగా ప్రారంభమైంది. గౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో భారీ ఎత్తున భక్తులు (Devotees) తరలివచ్చారు. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం ప్రారంభమైన యాత్ర.. రాత్రి 8 గంటలకు ముగియనుంది. మరో వైపు హనుమాన్‌ శోభయాత్రను ప్రశాంతంగా ముగిసే విధంగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 8 వేల పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. గౌలిగూడ రామ్‌మందిర్‌ నుంచి తాడ్‌బండ్‌లోని వీరాంజనేయస్వామి దేవాలయం వరకూ 21 కి.మీ. మేర యాత్ర కొనసాగనుంది.

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు:

  1. హనుమాన్‌ శోభయాత్ర సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు.
  2. శనివారం ఉదయం11 గంటల నుంచి రాత్రి 8 గంటలకు వరకు ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
  3. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గౌలిగూడ రామ్‌మందిర్‌ నుంచి ఆంధ్రా బ్యాంక్‌ కోఠి వరకు.
  4. మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు కోఠీలోని డీఎంహెచ్‌ కార్యాలయం నుంచి కాచిగూడ క్రాస్‌రోడ్స్‌ వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయి.
  5. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.15 గంటల వరకు కాచిగూడ క్రాస్‌రోడ్స్‌ నుంచి నారాయణగూడ వరకు.
  6. మధ్యాహ్నం 2.15 నుంచి 4.15 గంటల వరకు ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌, వీఎస్‌టీ, బాగ్‌లింగంపల్లి, ఇందిరాపార్క్‌, కవాడీగూడ, క్రాస్‌రోడ్స్‌ వరకు.
  7. సాయంత్రం 4.15 నుంచి 5.45 గంటల వరకు పాత రాంగోపాల్‌ పేట ఠాణా వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు.
  8. సాయంత్రం 6 గంటల నుంచి7 వరకు ప్యారడైజ్‌ కూడలి నుంచి బ్రూక్‌బాండ్‌ కాలనీ వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు.
  9. సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు బ్రూక్‌బాండ్‌ కాలనీ నుంచి తాడ్‌బండ్‌ వీరాంజనేయ స్వామి దేవాలయం వరకు.


ఇవి కూడా చదవండి:

PM Modi: 108 అడుగుల భారీ హనుమాన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

AP Employees: ఏపీ సచివాలయ ఉద్యోగులకు కొత్త తలనొప్పి.. మూడు సార్లు అటెండెన్స్