30 ఏళ్ల తర్వాత భాగ్యనగరంలో గ్రేట్ బాంబే సర్కస్.. టికెట్ రేటు ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే.!

| Edited By: Ravi Kiran

Feb 21, 2024 | 1:01 PM

Great Bombay Circus: ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపు సేద తీరడానికి మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, మూవీస్, ఔటింగ్స్ లాంటివి అందరికీ అందుబాటులోకి వచ్చాయ్. కానీ ఇలాంటివి కాకుండా ప్రశాంత వాతావరణంలో నవ్వుతూ, ఆశ్చర్యపోతూ, షాకవుతూ ఎంజాయ్ చేయాలంటే డిజిటల్ కాలం నుంచి బయటకి వెళ్లాల్సిందే.

30 ఏళ్ల తర్వాత భాగ్యనగరంలో గ్రేట్ బాంబే సర్కస్.. టికెట్ రేటు ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే.!
Bombay Circus
Follow us on

ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపు సేద తీరడానికి మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, మూవీస్, ఔటింగ్స్ లాంటివి అందరికీ అందుబాటులోకి వచ్చాయ్. కానీ ఇలాంటివి కాకుండా ప్రశాంత వాతావరణంలో నవ్వుతూ, ఆశ్చర్యపోతూ, షాకవుతూ ఎంజాయ్ చేయాలంటే డిజిటల్ కాలం నుంచి బయటకి వెళ్లాల్సిందే. మనలాంటి వారి కోసమే సిటీ నడిబొడ్డున ప్రత్యక్షమైంది ‘గ్రేట్ బాంబే సర్కస్’. టికెట్‌లు ఆన్‌లైన్‌లోనూ, మ్యానువల్‌గానూ తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో సర్కస్ టికెట్ తీసుకోవాలనుకునేవారు.. గ్రేట్ బాంబే సర్కస్ అఫీషియల్ వెబ్‌సైట్ సందర్శించాలని నిర్వాహకులు చెబుతున్నారు.

గ్రేట్ బాంబే సర్కస్ 104 సంవత్సరాల చరిత్రలో ఇప్పటివరకు భారతదేశంలోని అనేక నగరాల్లో విజయవంతంగా ప్రదర్శనలు ఇచ్చింది. మూడు దశాబ్దాల తర్వాత ప్రస్తుతం హైదరాబాద్‌ నగరానికి తిరిగి వచ్చింది. ఆసియాలోనే అతిపెద్ద సర్కస్‌గా పేరుగాంచిన గ్రేట్ బాంబే సర్కస్.. 30 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్  హెచ్‌ఎంటీ గ్రౌండ్స్‌లో ప్రదర్శన ఇస్తుంది. సికింద్రాబాద్ నుంచి ’24J’ సిటీ బస్‌లో నేరుగా వెళ్లవచ్చు. సొంత వాహనాల్లో వెళ్లేవారికి సికింద్రాబాద్ నుంచి 30 నిమిషాల సమయం మాత్రమే. ఈ బాంబే సర్కస్‌లో ప్రతిరోజూ మధ్యాహ్నం 1, సాయంత్రం 4, 7 గంటలకు ప్రత్యేక ప్రదర్శనలు అందుబాటులో ఉంటాయి. రూ. 100, 200, 300, 400 వరకు సర్కస్ టిక్కెట్ల ధరలు ఉన్నాయి.

గ్రేట్ బాంబే సర్కస్‌లో 60 అడుగుల ఎగిరే ట్రాపెజ్ కళాకారులు స్కైవాక్, అమెరికన్ ట్రాంపోలిన్, ఇథియోపియన్ ఐకారియన్ యాక్ట్, రష్యన్ రింగ్ డ్యాన్స్, అరేబియన్ వంటి ప్రపంచవ్యాప్తంగా డేర్ డెవిల్ విన్యాసాలు ప్రదర్శించే కళాకారులు ఇక్కడ మనల్ని అలరిస్తారు. మంగోలియన్ ఐరన్ బాల్ (స్ట్రాంగ్ మ్యాన్), చైనీస్ స్వోర్డ్ బ్యాలెన్స్, పిల్లలలో ఇష్టమైన జోకర్స్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 80 మందికిపైగా స్వదేశీ, విదేశీ కళాకారులు అద్భుతమైన విన్యాసాలు, వినూత్న కార్యక్రమాలను ప్రదర్శనతో పాటు విదేశీ కుక్కలతో నెంబర్‌ కౌంటింగ్‌ షో, పూర్తి కుటుంబ వినోదం కోసం మరెన్నో కార్యక్రమాలు ఉంటాయి.