ప్రచారంలో అభ్యర్థుల వ్యాఖ్యలపై గవర్నర్‌ సీరియస్‌.. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ..

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తమిళసై.. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు చేసే కామెంట్స్‌పై సీరియస్ అయ్యారు. ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని ఓ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో అన్నారని గవర్నర్ గుర్తు చేశారు.

ప్రచారంలో అభ్యర్థుల వ్యాఖ్యలపై గవర్నర్‌ సీరియస్‌.. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ..
Governor Tamilisai

Edited By: Ravi Kiran

Updated on: Jan 25, 2024 | 12:36 PM

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తమిళసై.. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు చేసే కామెంట్స్‌పై సీరియస్ అయ్యారు. ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని ఓ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో అన్నారని గవర్నర్ గుర్తు చేశారు. ఇలాంటి కాంట్రవర్షల్ కామెంట్స్ చేసే వారిపైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులకు సూచించారు.

జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్.. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఓటు అడగడం కరెక్ట్ కాదని ఇలాంటి వాటిపైనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఓటర్లను ఎవరూ ఫోర్స్ చేయొద్దని.. ఓటు శాతం పెరగడానికి ప్రకటనలు ఒక్కటే ఉపయోగపడవు అని అన్నారు. ప్రతి ఓటర్‌కి ఓటు మోస్ట్ పవర్‌ఫుల్ ఆయుధం అని అన్నారు. డెమోక్రసీ బతకాలి అంటే అందరూ ఓటు వేయాలని యువతకు తెలిపారు గవర్నర్.

ఓటర్ అనే వ్యక్తి తప్పకుండా ఓటు వేయాలని ఈవీఎం బాక్స్‌పైన నోటా అనే ఆప్షన్ ఉన్నప్పటికీ దానికి నేను వ్యతిరేకమని ఈ కార్యక్రమంలో గవర్నర్ అన్నారు. మంచి అభ్యర్థిని ఓటర్ ఎన్నుకుంటే మంచి పాలన అందుతుంది. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్నారు. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో అభ్యర్థి ఓటు వేయకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని అనడం బాధించిందని ఇలా ఓటు అడిగిన అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని ఇలాంటి మాటలకు ఎవరు లొంగవద్దని ఓటర్లకు సూచించారు గవర్నర్.

అసలు విషయం ఏంటంటే.?

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఆఖరు దశలో గతేడాది నవంబర్‌ 28న పాడి కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. హుజురాబాద్‌లో తనను గెలిపిస్తే విజయయాత్రకు వస్తానని.. ఓడిస్తే శవయాత్రకు రండి.. అంటూ ఆరోజు మాట్లాడారు. దండం పెడుతున్నా.. కాళ్లు పట్టుకుంటున్నా.. ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ప్రచారంలో వేడుకున్నారు. గవర్నర్‌ తమిళిసై ఇప్పుడు ఈ వ్యాఖ్యలనే ప్రస్తావించారు. ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని.. ఓ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో బెదిరించారని చెప్తూ ఇలాంటివారిపై ఎలక్షన్‌ కమిషన్‌ చర్యలు తీసుకోవాలని కోరారు.