MLA Rajasinghe, Police Notices: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు నోటీసులు అందించారు. ఎన్నికల సమయంలో బుల్లెట్ ఫ్రూట్ వాహనాన్ని ఉపయోగిస్తే డబ్బులు చెల్లించాలంటూ నోటీసులో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ఫ్రూట్ వాహనాన్ని రాజాసింగ్ ఉపయోగిస్తున్నాడు. అయితే పోలీసులు ఇచ్చిన నోటీసుపై రాజాసింగ్ స్పందించారు. ప్రమాదం ఉందని పోలీసులే బుల్లెట్ ఫ్రూప్ వాహనం ఇచ్చి ఇప్పుడు డబ్బులు కట్టమంటున్నారని ఆరోపించారు. తనకు ఇచ్చిన బుల్లెట్ ఫ్రూట్ వాహణం కండిషన్ బాగా లేదని, డర్ లాక్ పడితే ఓపెన్ కాదని ఆయన అన్నారు. అలాగే వాహనంలో అనేక సమస్యలున్నాయని, బుల్లెట్ ఫ్రూప్ వాహనాలు వాడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారా..? అని రాజాసింగ్ ప్రశ్నించారు. తన వాహనం ఎప్పుడు పాడవుతుందో చెప్పలేమని, తనకు ఇలాంటి వాహనం ఇస్తే ఎలా అని రాజాసింగ్ అన్నారు.
Also Read: వ్యభిచార చేయకపోతే చంపేస్తాంటూ వేధింపులు.. రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించిన మహిళ