Watch Video: అర్ధరాత్రి డ్యూటీ పోలీసును ఢీ కొట్టిన కారు.. వీడియో చూస్తే షాకవుతారు..

హైదరాబాద్, అక్టోబర్ 20: కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలగూడ చిల్లరోడ్డు వద్ద గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌కు గుర్తు తెలియని కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్ మహేష్‌ను కొట్టిన వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch Video: అర్ధరాత్రి డ్యూటీ పోలీసును ఢీ కొట్టిన కారు.. వీడియో చూస్తే షాకవుతారు..
Road Accident In Hyderabad

Updated on: Oct 20, 2023 | 11:24 AM

హైదరాబాద్, అక్టోబర్ 20: బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్‌ చిలకలగూడ ప్రాంతంలో దారుణం జరిగింది. డ్యూటీలో ఉన్న ఓ పోలీసు ఢీ కొట్టింది కారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలగూడ  వద్ద గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌కు గుర్తు తెలియని కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్ మహేష్‌ను కొట్టిన వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చిలకలగూడ చిల్లరోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులను కారుతో ఢీ కొట్టి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. సికింద్రాబాద్‌లోని గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకలగూడ అలుగడ్డ బావి వద్ద వాహనాల తనిఖీలు పోలీసులు నిర్వహిస్తున్నారు. వేగంగా వెళ్తున్నవారిని అడ్డుకునేందుకు  భారీ కేడ్లును ఏర్పాటు చేశారు. అటుగా వస్తున్న వాహనాలను తనిఖీలు చేస్తున్నారు పోలీసులు.. పోలీసులు ఆపుతున్నా.. మితిమీరిన వేగంగా వచ్చిన ఓ కారు భారీ కేడ్లను సైతం తప్పించుకుంది. ఆ కారును ఆపేందుకు యత్నించిన కానిస్టేబుల్ మహేశ్‌ను ఢీ కోట్టింది. దీంతో మహేశ్ ఎగిరికింద పడిపోయాడు.

కిందపడిపోయిన మహేష్‌ను మిగిలిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణపాయం లేదని.. చేయి మాత్రం విరిగినట్లు డాక్టర్లు తెలిపారు. గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు నెంబర్ ఆధారంగా వివరాలు కూపీ లాగే పనిలో పడ్డారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి