Hyderabad: కాలేజీ మహిళా ప్రిన్సిపాల్‌తో అడ్మిన్‌ HR సుబ్బారెడ్డి కామలీలలు

కాలేజీలోనే రాసలీలలకు తెరతీశారు ఓ ప్రిన్సిపల్‌, HR అడ్మిన్‌. ఏకంగా CC కెమెరాల ముందే వీళ్ల సరసాలు, అతి చేష్టలు చూడ్డానికే వికారం వచ్చేలా ఉన్నాయ్‌..! మియాపూర్‌లోని 'గ్లోబల్‌ కస్తూర్బా కాలేజీ ఆఫ్‌ నర్సింగ్‌'లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. మహిళా ప్రిన్సిపాల్‌తో, అడ్మిన్‌ HR లీలల విషయం తెలిసి విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి..

Hyderabad: కాలేజీ మహిళా ప్రిన్సిపాల్‌తో అడ్మిన్‌ HR సుబ్బారెడ్డి కామలీలలు
Nursing College Controversy

Edited By:

Updated on: Aug 06, 2026 | 5:43 PM

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి నియోజకవర్గంలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గోకుల్ ప్లాట్స్‌లో ఉన్న గ్లోబల్ కస్తూర్బా కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు అడ్మిన్ హెచ్‌ఆర్ సుబ్బారెడ్డి కళాశాల అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు కనిపిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టడంతో స్థానికంగా, విద్యార్థుల్లో చర్చనీయాంశంగా మారింది.

వైరల్ వీడియో నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగినట్లు సమాచారం. విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అలాగే విద్యార్థి సంఘాలు కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తూ, విద్యాసంస్థల ప్రతిష్ఠకు భంగం కలిగించే ఘటనలను ఏమాత్రం ఉపేక్షించరాదని పేర్కొన్నాయి. మియాపూర్ పోలీసులు, సంబంధిత విద్యాశాఖ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోరాయి.

గమనిక: ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో ప్రామాణికత, అందులోని ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. పోలీసులు లేదా సంబంధిత అధికారులు వెల్లడించే వివరాల ఆధారంగా మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us