Hyderabad: ప్రియుడితో కలిసి ఇంటికెళ్లిన ప్రియురాలు.. అందరూ చూస్తుండగానే గదిలోకి వెళ్లి..

|

May 27, 2023 | 12:51 PM

హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌లో ప్రియుడి ఇంట్లో ప్రియురాలు ఉరేసుకున్న ఘటన కలకలం రేపింది. మెహిదీపట్నంకి చెందిన పూజ చైతన్యపురి లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తోంది.. ఈ క్రమంలో హైదరాబద్ లోని జవహర్ నగర్ యాప్రాల్‌కి చెందిన దయాకర్ తో

Hyderabad: ప్రియుడితో కలిసి ఇంటికెళ్లిన ప్రియురాలు.. అందరూ చూస్తుండగానే గదిలోకి వెళ్లి..
Woman
Follow us on

హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌లో ప్రియుడి ఇంట్లో ప్రియురాలు ఉరేసుకున్న ఘటన కలకలం రేపింది. మెహిదీపట్నంకి చెందిన పూజ చైతన్యపురి లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తోంది.. ఈ క్రమంలో హైదరాబద్ లోని జవహర్ నగర్ యాప్రాల్‌కి చెందిన దయాకర్ తో పరిచయడం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

అయితే, పూజ, దయాకర్‌ ప్రేమ విషయం కాస్తా దయాకర్ తల్లికి తెలియడంతో ఆమె పిలిచి.. ఇద్దరినీ మందలించింది. అంతటి ఆగకుండా, దయాకర్ తల్లి పూజ పేరెంట్స్‌ని కూడా బెదిరించింది. ఇదే క్రమంలో దయాకర్.. తన ఇంటికి పూజని తీసుకెళ్లాడు. ఈ సమయంలో దయాకర్‌కి అతని తల్లికి మధ్య గొడవ జరిగింది.

వీరిద్దరి గొడవతో తీవ్ర మనస్థాపానికి గురైన పూజ.. ఓ రూమ్ లోకి పరిగెత్తుకుని వెళ్లి గడియ పెట్టుకుంది. అనంతరం ఫ్యాన్‌కి ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది.

ఇవి కూడా చదవండి

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దయాకర్‌తో పాటు అతని తల్లిపై కేసు నమోదు చేసి దర్యాప్టు చేస్తున్నట్లు జవహార్‌ నగర్‌ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..