Hyderabad: ఆకాశానికి చిల్లు పడిందా ఏంటి.?.. నగర ప్రజలకు GHMC కీలక సూచనలు.. బీ అలెర్ట్

|

Jul 23, 2022 | 8:09 AM

భాగ్యనగరంలో వానలు దంచి కొడుతున్నాయి. పలు ప్రాంతాలను వరద నీరు చుట్టుముట్టింది. ఈ క్రమంలో GHMC ప్రజలకు కీలక సూచనలు చేసింది. అలెర్ట్‌గా ఉండాలని కోరింది.

Hyderabad: ఆకాశానికి చిల్లు పడిందా ఏంటి.?.. నగర ప్రజలకు GHMC కీలక సూచనలు.. బీ అలెర్ట్
Hyderabad Rains
Follow us on

Telangana: భాగ్యనగరంపై వరుణుడు పగబట్టేశాడు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. లోతట్టు ప్రాంతాలే కాదు దాదాపు అన్ని ఏరియాలూ వర్షంతో వణికిపోయాయి. రోడ్లపై నీరు నిలిచి… రాకపోకలకు అంతరాయం కలిగింది. టోటల్‌గా సిటీ లైఫ్ మొత్తం కకావికలమైంది. భారీ వర్షానికి బేగంపేట, రాజ్‌భవన్‌రోడ్‌ ప్రాంతాలు జలమయం అయ్యాయి. యూసుఫ్‌గూడ(Yousufguda), కృష్ణానగర్‌కాలనీ(Krishnanagar)లను వరద ముంచెత్తింది. స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి తలెత్తింది. అమీర్‌పేట్‌లో రహదారిపై భారీగా నీరు నిలిచిపోయింది. నిజాంపేట్‌ కాలనీల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. వరద నీటిలో కార్లు మునిగిపోయాయి. కుత్బుల్లాపూర్ లోనూ వివిధ బస్తీలను సైతం వరద ముంచెత్తింది. కూకట్ పల్లి(Kukatpally)లోనూ జోరు వర్షంతో కాలనీల్లోని రోడ్లపై వర్షపునీరు పోటెత్తింది. చార్మినార్ ప్రాంతంలో రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. కస్టమర్లతో కిక్కిరిసిపోయి రద్దీగా కనిపించే చార్మినార్ పరిసరాన్నీ బోసిపోయాయి. వస్తువులన్నీ తడిసిపోయి వేలాదిమంది రోడ్‌సైడ్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఐడీఎల్ ప్రాంతంలో రోడ్లన్నీ చెరువుల్ని తలపించాయి. అపురూపకాలనీలో ఇళ్లు నీటమునిగాయి. సామగ్రి పూర్తిగా తడిచిపోయింది. మూసాపేటలో మోకాళ్ల లోతు నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నీటిని ఎత్తిపోసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉండడంతో GHMC అలర్ట్‌ అయింది. NDRF, SDRF టీమ్స్‌ సహాయక చర్యలు చేపట్టాయి. అటు… పోలీసులు కూడా రెయిన్ డ్యూటీలో దిగి… తీవ్రంగా శ్రమిస్తున్నారు. నీళ్లు నిలిచిన చోట.. సాహసోపేతంగా పనిచేస్తున్నారు.

ప్రగతినగర్‌లో కురిసిన వానలు అపార్ట్‌మెంట్ల వాసులకు నరకప్రాయంగా మారాయి. రోడ్డుమీద నుంచి నీరంతా సెల్లార్‌లో చేరుతోంది. నీటిలో పాము కనిపించడంతో బెంబేలెత్తిపోయారు జనం. హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద వస్తుండడంతో .. పరివాహక ప్రాంత ప్రజలను అలర్ట్‌ చేశారు. సాగర్‌ నీటిమట్టం గరిష్టస్థాయిని దాటి నమోదవుతోంది. ఎగువ ప్రాంతం.. కూకట్‌పల్లి నాలా నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో సాగర్‌ నాలా వెంబడి అలర్ట్‌గా ఉండాలని హెచ్చరిస్తోంది.  హైదరాబాద్‌లో రాగల రెండు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తడిచిన స్తంభాలు ముట్టుకోవద్దని, తెలియని రూట్లలో ప్రయాణాలు చేయొద్దని, మ్యాన్‌హోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. వర్షం తగ్గిందని బయటకు రావొద్దని.. వీలైనంత వరకు ప్రయాణాలు మానుకోవాలని హెచ్చరిస్తోంది జీహెచ్‌ఎంసీ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ్ క్లిక్ చేయండి..