మహా భాగ్యనగరం.. వినాయక నిమజ్జనానికి రెడీ అయింది. హైదరాబాద్ నగరంతో పాటు.. శివారు ప్రాంతాల్లో కూడా.. గణనాథుడి ప్రతిమలను గురువారం నిమజ్జనం చేయనున్నారు. గురువారం ఉదయం నుంచీ.. శుక్రవారం మధ్యహ్నం వరకూ.. నిమజ్జనం కొనసాగనున్న దృష్ట్యా రద్దీ ఏర్పడుతుంది. దీంతో… తెలంగాణ ప్రభుత్వం పలు ట్రాఫిక్ రూల్స్ విధించింది. మరి… ఏదారి ఎటువైపో తెలుసుకుందామా..!
బాలాపూర్ నుండి వచ్చే వినాయకులు, పాతబస్తీ మీదుగా వచ్చే గణనాథులు, కేశవగిరి అలియాబాద్, నాగుల్‌చింత నుంచి వచ్చే విగ్రహాలు.. చార్మినార్, మదీన, అఫ్జల్ గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, మీదుగా లిబర్టీ, అప్పర్ ట్యాంక్ బండ్ లేదా ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకోవాలి. అలాగే.. టప్పాచబుత్ర అసిఫ్ నగర్ మీదుగా వచ్చే విగ్రహాలు సీతారాం బాగ్, బోయిగూడ కమాన్ మీదుగా గోషామహల్ అలస్కా నుంచి ఎంజే మార్కెట్ చేరుకోవాలి.
అటు.. సికింద్రాబాద్ నుంచే విగ్రహాలు ఆర్పీరోడ్, ఎంజీ రోడ్, కర్బలా మైదానం, కవాడీగూడ, ముషీరాబాద్, ఎక్స్ రోడ్ మీదుగా ఆర్టీసీ క్రాస్ రోడ్ చేరుకోవాలి. అక్కడి నుండి నారాయణగూడ చౌరస్తా, హిమాయత్ నగర్, వై జంక్షన్ మీదుగా లిబర్టీకి చేరుకోవాలి. అక్కడినుంచి ట్యాంక్‌బండ్‌పైకి చేరుకోవాలి. తార్నాక వైపు నుంచి వచ్చే విగ్రహాలు ఓయూ డిస్టెన్స్ ఎడ్యూకేషన్ రోడ్, అడిక్‌మెట్ నుంచి.. విద్యానగర్ మీదుగా ఫీవర్ ఆస్పత్రి దగ్గర జాయిన్ అవ్వాలి.
ఇక ఈస్ట్ జోన్ నుంచి వచ్చే విగ్రహాల ఊరేగింపు ఉప్పల్, రామంతాపూర్, ఛే నెంబర్ జంక్షన్, శివం రోడ్, ఓయూ ఎన్సీసీ గేట్, డీడీ హస్పిటల్, హిందీ మహా విద్యాలయ క్రాస్ రోడ్ మీదుగా.. ఫీవర్ ఆస్పత్రి, బర్కత్‌పురా చౌరస్తా, నారాయణ గూడ చౌరస్తా మీదుగా ట్యాంక్ బండ్‌పైకి చేరుకోవాలి. అలాగే.. దిల్‌సుఖ్ నగర్ నుంచి వచ్చే ఊరేగింపు విగ్రహాలు ఐఎస్ సదన్‌సైదాబాద్, చంచల్ గూడ, నల్లగొండ చౌరస్తా మీదుగా సరూర్ నగర్ చెరువును చేరుకోవాలి.
ఇక టోలిచౌకి నుంచి వచ్చే విగ్రహాల ఊరేగింపు టోలిచౌకి, రేతిబౌలి, మెహిదీపట్నం, మాసబ్ టాంక్, అయోధ్య జంక్షన్, నిరంకారీ భవన్ మీదుగా.. పాత సైఫాబాద్ పీఎస్, ఇక్బాల్ మినార్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకోవాలి. అటు ఎర్రగడ్డ నుంచి వచ్చే విగ్రహాలు ఎస్సార్ నగర్, అమీర్ పేట, పంజాగుట్ట, వీవీ విగ్రహం దగ్గర నుంచి ట్యాంక్ బండ్‌కు చేరుకోవాలి.