హైదరాబాద్ గచ్చిబౌలిలోని రెడ్‌స్టోన్ హోటల్‌లో నర్సింగ్ విద్యార్థిని శృతి మృతి ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన వియం తెలిసిందే. తొలుత ఆత్మహత్యగా భావించారు. కానీ కుటుంబ సభ్యుల ఆరోపణ నేపథ్యంలో ఆత్యాచార, హత్య నేపథ్యంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా శృతి ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు కేసును చేధించారు. శృతిది ఆత్మహత్యేనని, దీనికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధారించారు. హోటల్ గదిలో బీరు తాగిన సమయంలోని ఇరువురి మధ్య పెళ్లి విషయం చర్చకు వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో జీవన్ పెళ్లికి నిరాకరించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగిందని. ఆ తర్వాత జీవన్ పక్కనే ఉన్న తన ఫ్రెండ్ గదికి వెళ్లిపోయాడని పోలీసులు తేల్చారు. అదే సమయంలో శృతి క్షణికావేశంలో గదిలో ఉన్న ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
ఇక కేసు విషయానికొస్తే జడ్చర్లకు చెందిన శృతి (23) గత ఆదివారం హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన వేడుకలకు చూసేందుకు గాను మోనా, జీవన్ మరో అబ్బాయితో కలిసి వచ్చారు. ఇదే విషయాన్ని తెలిపి రెడ్‌స్టోన్ హోటల్‌లో రెండు గదులను తీసుకున్నారు. ఆ తర్వాత శృతితో వచ్చిన వారంతా హోటల్ నుంచి బయటకు వెళ్లారు. అదే సమయంలో శృతి గదిలో ఒంటరిగా ఉంది. ఇక బయటకు వెళ్లిన వారు సోమవారం తెల్లవారు జాము 3 గంటలకు హోటల్‌కు తిరిగి వచ్చారు. ఎంతకీ శృతి ఎంతకీ డోర్ తీయకపోవడంతో హోటల్ సిబ్బందికి చెప్పడంతో వారు మాస్టర్ కీతో తలుపు తీశారని.. అప్పుడు లోపల ఫ్యానుకు ఉరివేసుకుని కనిపించిదని యువతి ఫ్రెండ్స్ తెలిపారు.
సమాచారం తెలుసుకున్న యువతి పేరెంట్స్ హోటల్‌కు చేరుకున్నారు. ఇది కచ్చితంగా హత్యేనంటూ ఆందోళన చేశారు. బీర్ బాటిల్స్, రక్తపు మరకలు ఉన్నాయని, తమ కూతురును చంపేశారంటూ వాపోయారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని మార్గాల్లో విచారణ చేపట్టి శృతిది ఆత్మహత్యేనని తేల్చారు. ప్రస్తుతం తదుపరి విచారణ కొనసాగుతోది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..