Hyderabad: భార్య ఇంట్లో నుంచి బయటకు రాకుండా రాత్రికి రాత్రే గోడ కట్టిన భర్త.. అతడెవరో తెలుసా..?

|

May 14, 2022 | 5:51 PM

తన భార్యను ఇంట్లోనే ఉంచి ఆమె బయటకురాకుండా ఉండేందుకు రూమ్‌లో ఒక అడ్డుగోడ కట్టాడు ఓ వ్యక్తి. రాత్రి గోడ నిర్మించి పత్తా లేకుండా పోయాడు.

Hyderabad: భార్య ఇంట్లో నుంచి బయటకు రాకుండా రాత్రికి రాత్రే గోడ కట్టిన భర్త.. అతడెవరో తెలుసా..?
Husband Harassed Wife
Follow us on

పుల్లారెడ్డి స్వీట్స్‌(Pulla Reddy Sweets) వ్యవస్థాపకుడు జి.పుల్లారెడ్డి మనవడు ఏక్‌నాథ్ రెడ్డి పై గృహ హింస కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. ఏక్‌నాథ్ రెడ్డికి, అతని భార్యకు కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఏక్‌నాథ్ రెడ్డి తన భార్యను ఇంట్లోనే ఉంచి ఆమె బయటకురాకుండా ఉండేందుకు రూమ్‌లో ఒక అడ్డుగోడ కట్టాడు. రాత్రి గోడ నిర్మించి పారిపోయాడు. ఇదంతా గ్రహించిన బాధితురాలు డయల్‌ 100కు ఫోన్‌ చేసి తన పరిస్థితిని వివరించింది. వెంటనే స్పందించిన పంజాగుట్ట పోలీసులు.. బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెకు బయటకు తీసుకువచ్చారు.  భార్య ఫిర్యాదుతో ఏక్‌నాథ్‌ రెడ్డిపై వరకట్న వేధింపుల కేసుతో పాటు గృహహింస కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. గత కొంతకాలంగా ఏక్‌నాథ్‌రెడ్డి దంపతుల మధ్య అభిప్రాయ బేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. భార్యను ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా ఏక్‌నాథ్‌ అడ్డుకుంటున్నట్లుగా సమాచారం. అంతేకాదు.. ఏకంగా రాత్రికి రాత్రే ఆమె ఉంటున్న గదికి అడ్డుగా గోడ నిర్మాణం చేసిన సంగతి తెలిసి అందరూ షాకవుతున్నారు. పోలీసులు ఏక్‌నాథ్‌పై వరకట్న వేధింపులు, గృహహింస కేసులు నమోదు చేసి.. విచారణ ప్రారంభించారు. ఏక్‌నాథ్ రెడ్డి తండ్రి రాఘవరెడ్డి జి పుల్లారెడ్డి గ్రూపునకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఏక్‌నాథ్‌రెడ్డి వివాహ రిసెప్షన్  2014 మార్చిలో అంగరంగ వైభవంగా హైదరాబాద్‌లోని జేఆర్‌ఎసీ కన్వెన్షన్‌లో జరిగింది. ఏక్‌నాథ్ రెడ్డి భార్య తండ్రి మైనింగ్ వ్యాపారంలో స్థిరపడ్డారు. పేరున్న కుటుంబం కావడంతో పుల్లారెడ్డి ఫ్యామిలీతో వియ్యం అందుకున్నారు. కానీ.. ఇలా కూతురిని.. అల్లుడు ఇబ్బంది పెడతాడని ఊహించలేకపోయామని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ వ్యవహరానికి సంబంధించి పంజాగుట్ట పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు.