Praja Bhavan Accident: ఎట్టకేలకు అరెస్ట్‌.. పోలీసుల అదుపులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు..

Ex MLA Son Case: నాలుగు నెలల కిందట సంచలనం సృష్టించిన ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు రహిల్‌ ఎట్టకేలకు అరెస్ట్‌ అయ్యాడు. షకీల్‌ కొడుకు రహిల్ ను పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్‌ చేశారు. ప్రజాభవన్‌ దగ్గర బారికేడ్‌ను ఢీకొట్టిన కేసులో రహిల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.. ఇప్పటికే లుకౌట్‌ నోటీసులు జారీ చేసిన పోలీసులు..

Praja Bhavan Accident: ఎట్టకేలకు అరెస్ట్‌.. పోలీసుల అదుపులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు..
Praja Bhavan Accident Case

Updated on: Apr 08, 2024 | 9:55 AM

Ex MLA Son Case: నాలుగు నెలల కిందట సంచలనం సృష్టించిన ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు రహిల్‌ ఎట్టకేలకు అరెస్ట్‌ అయ్యాడు. షకీల్‌ కొడుకు రహీల్ ను పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్‌ చేశారు. ప్రజాభవన్‌ దగ్గర బారికేడ్‌ను ఢీకొట్టిన కేసులో రహిల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.. ఇప్పటికే లుకౌట్‌ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. శంషాబాద్ ఏయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు రహీల్ ను కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దీంతో  పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

గత ఏడాది డిసెంబర్‌ 24న జరిగిన పంజాగుట్ట హిట్ అండ్ రన్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.. ఈ ఘటన అనంతరం రహిల్ అమిర్ దుబాయ్ పారిపోయాడు. రహిల్ హిట్ అండర్ రన్ కేసు అనంతరం.. ఊహించని పరిణామాలు తెరపైకి వచ్చాయి. రహిల్ దేశం దాటడంలో అధికారులు సాయపడినట్టు తేలింది.. ఈ ఘటన అనంతరం పంజాగుట్ట, బోధన్ సీఐలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. షకీల్ కుమారుడు విదేశాలకు పారిపోవడానికి సహకరించారని తేలడంతో వారిని అరెస్టు చేశారు.

ఆ రోజు ఏం జరిగిందంటే..?

యాక్సిడెంట్‌ తరువాత సోహైల్‌ను పంజాగుట్ట ఠానాకు కానిస్టేబుల్స్‌ తరలించారు. అంతలోనే మాజీ ఎమ్మెల్యే షకీల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కానీ ఠానాలో ఏ మంత్రాంగం జరిగిందో ఏమో కానీ సోహైల్ బదులు షకీల్ ఇంట్లో పని మనిషిని కేసులో చేర్చారు పోలీసులు. సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే కుమారుడు విదేశాలకు పారిపోయాడు.. ఈ వ్యవహారంలో సీఐ, నైట్ డ్యూటీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ పాత్ర ఉన్నట్లు తేల్చిన అధికారులు వారిని అరెస్టు చేశారు.

ఇదిలాఉంటే.. ఇటీవల మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై ఉన్న లుకౌట్ నోటీస్‌ కొట్టివేయాలని కోర్టులో పిటిషన్ వేశాడు. ప్రమాదం తర్వాత దుబాయ్‌ పారిపోయిన రహీల్‌ నాలుగు నెలల పాటు అక్కడే ఉన్నాడు. ఈ కేసులో రహీల్‌ తండ్రి షకీల్ ను సైతం నిందితుడిగా చేర్చిన పోలీసులు ఆయనపై కూడా లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. దీంతో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రహీల్‌ తనపై ఉన్న లుకౌట్ నోటీస్‌ కొట్టివేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశాడు పోలీసులకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నాడు రాత్రి సమయంలో ప్రమాదం జరిగిందని.. బారికేడ్ దగ్గర సరైన సిగ్నలింగ్‌ ఏర్పాటు చేయలేదని ఆరోపించాడు. నిర్లక్ష్యం వహించిన పోలీసులపై కేసు నమోదు చేయాలన్నాడు. ఈ క్రమంలోనే పోలీసులు రహిల్ ను అరెస్టు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..