Hyderabad: హోటల్‌కి వెళ్లి ఇలాంటి ఫుడ్ తింటున్నారా..? మీ లైఫ్ ఖతం

|

Mar 01, 2024 | 4:26 PM

హైదరాబాద్‌లో స్ట్రీట్‌ఫుడ్ కల్చర్.. ఇది నగరాన్ని ఎంత గట్టిగా ఆవహించేసిందో అందరికీ తెలుసు. వీధిలో నిలబడి అల్పాహారం ఆరగించడం అనేది ఒక హాబీగా మారింది. అలానే హోటల్స్, రెస్టారెంట్స్‌లో తినేవారు ఎక్కువైపోయారు. అయితే మీరు తింటున్న ఫుడ్ ఫ్రెష్‌యేనా..? మంచిగానే కుక్ చేస్తున్నారా..?

Hyderabad: హోటల్‌కి వెళ్లి ఇలాంటి ఫుడ్ తింటున్నారా..? మీ లైఫ్ ఖతం
Tandoori Chicken
Follow us on

మీకు రెగ్యులర్‌గా హోటల్స్, రెస్టారెంట్స్‌కి వెళ్లి తినే అలవాటు ఉందా..? టేస్ట్‌ బాగుందని ఫుడ్‌ లాగించేస్తున్నారా? మీరు తింటున్న ఫుడ్‌ మంచిదేనా? రాజేంద్రనగర్‌లోని వెంగమాంబ హోటల్‌లో ఏం జరిగిందో మీరు తెలుసుకోవాల్సిందే. మార్కెట్లో ఇవాళ తెచ్చిన మాంసానికి ఆర్డర్‌ వచ్చిందా సరేసరి. లేదంటే ఫ్రీజ్‌లో పెడతారు. మళ్లీ ఉదయాన్నే వండుతారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన దాడుల్లో భయంకరమైన నిజాలు వెలుగుచూశాయి. అక్కడి ఫుడ్‌ చూసి అధికారులే షాక్‌కు గురయ్యారు.

అందమైన బోర్డులు.. ఆకర్షించే చెఫ్‌లు.. రెగ్యులర్‌గా వెళ్లే వారికి మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించేలా! అసలు టేస్ట్‌ చేయని వారికైతే.. ఓసారి వెళ్తే ఎలా ఉంటుందో అని అనేలా.. ఊరిస్తున్నాయి రెస్టారెంట్స్. కుర్చీలో కూర్చోగానే.. డిజైన్ ప్లేట్‌తో.. అత్యంత మర్యాదగా వడ్డిస్తాడు వెయిటర్. భలే ఉంది అని కడుపులో కుక్కి కుక్కి.. బయటకొస్తాం మనం. కాని అసలు వాస్తవాలు తెలిస్తే షాక్‌ గురవ్వాల్సిందే! ఎన్ని హోటల్స్‌లో సేఫ్ ఫుడ్ ఉంటుందో తెలిస్తే.. ఇక మనం అటు వైపే చూడం.

రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో ఉన్న SVM గ్రాండ్‌ హోటల్లో జిహెచ్ఎంసి కమిషనర్‌, ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టిప తనిఖీల్లో కుళ్లిన చికెన్‌, ఆహార పదార్ధాలు గుర్తించారు. హోటల్‌ సీజ్‌ చేసి, కేసు నమోదు చేశారు. మూడు రోజుల నుంచి ఫ్రిడ్జ్‌లో ఉంచిన చికెన్‌ తందూరి, పలు ఆహార పదార్ధాలను గుర్తించారు. అవి కుళ్లిపోయి ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే ఊరుకోబోమన్న అధికారులు…హోటల్‌పై చర్యలకు సిద్ధమయ్యారు.

హోటల్స్‌ ఆరోగ్యానికి మంట పెడుతున్నాయి. కుళ్లిన ఫుడ్‌ను సప్లై చేస్తూ మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు తనిఖీలు చేసినప్పుడే.. జాగ్రత్త పడుతున్నారు. ఆ తర్వాత మాత్రం మళ్లీ కల్తీకి గేట్లు ఓపెన్‌ చేస్తున్నారు హోటల్స్‌ నిర్వాహకులు. హోటల్స్‌పై నిరంతరం పర్యవేక్షణ ఉండాలంటున్నారు ప్రజలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…