Hyderabad Rains: వర్షంలో బండి బయటకు తీస్తున్నారా.? అయితే ముందు ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి..

|

Jul 09, 2022 | 11:26 AM

Hyderabad Rains: ప్రస్తుతం వర్షాలు భారీగా పడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తాజాగా తెలిపిన వివరాల ప్రకారం మరో రెండు రోజుల పాటు వర్షాలు...

Hyderabad Rains: వర్షంలో బండి బయటకు తీస్తున్నారా.? అయితే ముందు ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి..
Follow us on

Hyderabad Rains: వర్షాలు భారీగా పడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తాజాగా తెలిపిన వివరాల ప్రకారం మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఈ వర్షాల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయనే విషయం తెలిసిందే. రోడ్లన్నీ నీటితో తడిసిపోతాయి. రోడ్డు సరిగ్గా కనిపించదు. వెరసి ప్రమాదాలు జరుగుతాయి. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మాత్రం ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా.. ఈ వర్షా కాలన్ని సేఫ్‌గా దాటేయవచ్చు. ఆ జాగ్రత్తలు ఏంటంటే..

లైట్స్‌ చెక్‌ చేసుకోండి..

సాధారణంగానే వ‌ర్షాకాలం త్వ‌రగా చీక‌టి ప‌డుతుంది కాబ‌ట్టి లైట్లు స‌రిగా ప‌నిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. వాహనాన్ని ఇంట్లో నుంచి బయటకు తీస్తున్నామంటే ముందుగా లైట్స్‌ పనిచేస్తున్నాయో చెక్‌ చేసుకోవాలి. దీనివల్ల ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశాలు తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

వైపర్స్‌ని వాడండి..

కొంత మంది వాహనదారులు వైపర్స్‌ను ఉపయోగించరు. వర్షం పడుతోన్న అలాగే ముందుకు వెళ్తారు. అయితే అద్దంపై ప‌డే నీటిని ఎప్పటిక‌ప్ప‌డు తొల‌గించ‌క‌పోతే రోడ్డు స‌రిగా కనిపించ‌క ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశాలున్నాయి. కాబ‌ట్టి వైప‌ర్ స‌రిగ్గా ప‌నిచేస్తుందో లేదో చెక్ చేసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా ఉపయోగించాలి.

అతివేగం అస్సలు వద్దు..

వర్షాకాలంలో అతివేగం జోలికి పోకూడదు. ఆలస్యమైనా పర్లేదు గమ్యాన్ని క్షేమంగా చేరుకుందామనే ఆలోచనతో ఉండాలి. రోడ్ల‌న్నీ నీటితో ఉండ‌డం వ‌ల్ల తెరిచిన మ్యాన్ హోల్స్‌లో ప‌డిపోయే ప్ర‌మాదం ఉంది. అలాగే స్పీడ్‌ కారణంగా టైర్లు స్కిడ్ అయ్యే అవ‌కాశాలు కూడా ఉంటాయి.

దూరం తప్పనిసరి..

వాహనాలు నీటితో తడవడం వల్ల కొన్ని సందర్భాల్లో బ్రేక్‌లు సరిగ్గా పనిచేయవు. కాబట్టి ముందున్న వాహనాలకు ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముందు వెళుతోన్న వాహనానికి మధ్య కచ్చితంగా దూరం ఉండేలా చూసుకోవాలి.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..