Hyderabad: భాగ్యనగర్ వాసులకు గుడ్ న్యూస్.. ఎంఎంటీఎస్ టికెట్ ధరలు తగ్గింపు.. నేటి నుంచి అమల్లోకి

|

May 05, 2022 | 9:04 AM

Hyderabad: హైదరాబాద్ లో ఎంఎంటీఎస్(MMTS) ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పారు రైల్వే అధికారులు.  50 శాతం మేర తగ్గించిన ఫస్ట్ క్లాస్ టికెట్ ఛార్జీలు(First Class Ticket Fares)నేటి నుంచి అమల్లోకి..

Hyderabad: భాగ్యనగర్ వాసులకు గుడ్ న్యూస్.. ఎంఎంటీఎస్ టికెట్ ధరలు తగ్గింపు.. నేటి నుంచి అమల్లోకి
Hyderabad Mmts
Follow us on

Hyderabad: హైదరాబాద్ లో ఎంఎంటీఎస్(MMTS) ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పారు రైల్వే అధికారులు.  50 శాతం మేర తగ్గించిన ఫస్ట్ క్లాస్ టికెట్ ఛార్జీలు(First Class Ticket Fares)నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఓ వైపు ఆర్టీసీ బస్సుల ధరలు పెరగడంతో ఇబ్బంది పడుతున్న ప్రయాణీకులకు ఎంఎంటీఎస్ టికెట్ ధరల తగ్గింపుతో కొంచెం ఉపశమనం లభించనుంది.  ఎంఎంటీఎస్  ఫస్ట్ క్లాస్ టికెట్ ఛార్జీలను గురువారం (మే 5) నుంచి 50 శాతానికి తగ్గించారు. సబర్బన్ రైలు సర్వీసుల్లో ఫస్ట్-క్లాస్ బేసిక్ ఛార్జీలను నేటి నుంచి అమల్లోకి తీస్కుని రావడానికి రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం, సబర్బన్ మీదుగా MMTS రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు సింగిల్ జర్నీకి ఫస్ట్-క్లాస్ బేస్ ఛార్జీలు సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ డివిజన్ల సెక్షన్‌లను తగ్గించారు. ఈ రాయితీ  ఫస్ట్ క్లాస్ సింగిల్ జర్నీ ప్యాసింజర్లకు వర్తిస్తుంది.

కోవిడ్ విధించిన లాక్‌డౌన్ తర్వాత సేవలను తిరిగి ప్రారంభించినప్పటి నుండి దక్షిణ మధ్య రైల్వే సబ్-అర్బన్ ప్రయాణీకుల ప్రయోజనం కోసం MMTS సేవల సంఖ్యను క్రమంగా పెంచుతోంది..  SCR ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

MMTSలో ఫస్ట్-క్లాస్‌లో దూరం వారీగా తగ్గిన ఛార్జీల వివరాలు: 
1-5 కి.మీకి, ఫస్ట్ క్లాస్‌లో తగ్గిన సింగిల్ జర్నీ ఛార్జీ గతంలో ఏయే. 50 లు ఉండగా ఇప్పుడు రూ.25లకు తగ్గింది.
6-10 కిలోమీటర్లకు, ఫస్ట్ క్లాస్‌లో తగ్గిన సింగిల్ జర్నీ ఛార్జీ కూడా రూ.25
11-15 కిలోమీటర్లకు, ఫస్ట్ క్లాస్‌లో తగ్గిన సింగిల్ జర్నీ ఛార్జీ రూ.35
16-20 కిలోమీటర్లకు, ఫస్ట్ క్లాస్‌లో తగ్గిన సింగిల్ జర్నీ ఛార్జీ రూ.55
21-25 కిలోమీటర్లకు, ఫస్ట్ క్లాస్‌లో తగ్గిన సింగిల్ జర్నీ ఛార్జీ రూ.55
26-30 కిలోమీటర్లకు, ఫస్ట్ క్లాస్‌లో తగ్గిన సింగిల్ జర్నీ ఛార్జీ రూ.85
31-35 కిలోమీటర్లకు, ఫస్ట్ క్లాస్‌లో తగ్గిన సింగిల్ జర్నీ ఛార్జీ రూ.85
36-40 కిలోమీటర్లకు, ఫస్ట్ క్లాస్‌లో తగ్గిన సింగిల్ జర్నీ ఛార్జీ రూ.90
41-45 కిలోమీటర్లకు, ఫస్ట్ క్లాస్‌లో తగ్గిన సింగిల్ జర్నీ ఛార్జీ రూ.90

ప్రస్తుతం..  ఫలక్‌నుమా-సికింద్రాబాద్-హైదరాబాద్-బేగంపేట-లింగంపల్లి-తేలాపూర్-రామచంద్రపురం విభాగాల్లో 29 రైల్వే స్టేషన్‌లను కవర్ చేస్తూ 50 కిలోమీటర్ల మేర 86 సర్వీసులు నడుస్తున్నాయి. వివిధ ఎంఎంటీఎస్ స్టేషన్‌లలో రద్దీని పరిగణనలోకి తీసుకుని ప్రయాణీకుల ప్రయాణ అవసరాలను తీర్చడానికి ఈ సేవలను అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. దీంతో వేగవంతమైన సర్వీసులతో పాటు చౌక ధరలో ప్రయాణాన్ని భాగ్యనగర వాసులకు కల్పించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: Hyderabad: స్వగృహ ప్లాట్స్ అమ్మకానికి సిద్ధం.. ఆసక్తిగలవారు ఎలా ధరఖాస్తు చేసుకోవాలంటే.. పూర్తి వివరాలు మీకోసం

Paddy Procurement: తెలంగాణ విజ్ఞప్తికి కేంద్రం ఆమోదం.. రబీ ధాన్యం కొనుగోలుకు గడువు పొడిగింపు