హైదరాబాద్ మోట్రో ట్రైన్ మరోసారి నిలిచిపోయింది. మెట్రో ట్రాక్ ఎలక్ట్రిక్ పోల్స్‌పై స్వల్ప మంటలు చెలరేగాయి. దీంతో ట్రైన్ మార్గ మధ్యలోనే ఆగిపోయింది. బేగంపేట నుంచి అమీర్‌పేటకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని ప్రయాణికులు చెబుతున్నారు. దాదాపు అర్ధగంట నుంచి ట్రైన్ నిలిచిపోయిందన్నారు. దీంతో మిగతా రైళ్లకు కూడా అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది.