
హైదరాబాద్, అక్టోబర్ 13: ఆదాయం రావాలంటే.. దానికి ఎన్నో దారులున్నాయి.. దానికి తగినట్లుగా తెలంగాణ రవాణా శాఖ ప్రణాళికలు రచించి.. కాసులను సమకూర్చుకుంటోంది. రవాణా శాఖ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ బిడ్డింగ్ లో భారీ ఆదాయం వచ్చి చేరుతోంది. ప్రతి రోజు ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహనదారులు పోటీ పడుతున్నారు. ఇటు ఆర్టీఏ అధికారులు నిర్వహిస్తున్న ఆన్ లైన్ బిడ్డింగ్‌లో గురువారం ఒక్కరోజే ఫ్యాన్సీ నంబర్లకి భారీగా ధరలు పలికాయి. గురువారం ఒక్కరోజే 41,86,370 ఆదాయం వచ్చింది. అత్యధికంగా టీఎస్ 09జీడీ9999 నంబర్ ప్లేట్‌కు 15లక్షల 53వేల ధరతో ముప్పాహోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బిడ్డింగ్‌లో దక్కించుకుంది.
ఫ్యాన్సీ నంబర్స్‌కు పెరుగుతున్న క్రేజ్‌తో రవాణా శాఖకు కాసుల పంట పడుతోంది. హైద్రాబాద్ ఆర్టీఏకు ఫ్యాన్సీ నంబర్ ప్లేట్స్ కోసం వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. దీంతో నచ్చిన ప్యాన్సీ నంబర్ దక్కించుకునేందుకు ఎంత ఖర్చు చేయడానికైన వేనకాడటం లేదు. హైద్రాబాద్ ఆర్టీఏ నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ ఆక్షన్ తో ఒక్క రోజే 41,86,370 ఆదాయం వచ్చి చేరింది.
కొత్త వెహికిల్స్ కొనడం ఒక ఎత్తు అయితే.. వాటికి ఫ్యాన్స్ నంబర్స్ కొనడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. వెహికిల్ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్స్‌కు అయితే రోజు రోజకు క్రేజ్ పెరుగుతోంది. దీంతో రవాణా శాఖకు భారీగా ఆదాయం వచ్చి చేరుతోందని.. అధికారులు పేర్కొంటున్నారు. ఖైరతాబాద్ ఆర్టీఏ ( సెంట్రల్ జోన్) లో ఫ్యాన్సీ నంబర్లకు వేలం నిర్వహిస్తున్నామని.. ఆసక్తిగల వాహనదారులు బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చని ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ( జేటీసీ) పాండురంగ నాయక్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..