హైదరాబాద్‌లో నకిలీ లైసెన్స్‌తో తుపాకులు అమ్ముతున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోర్జరీ సంతకాలు చేస్తూ నకిలీ గన్ లైసెన్స్ సృష్టిస్తున్న ముఠా గుట్టు, రట్టు చేశారు. సొంతంగా తుపాకులు తయారుచేస్తూ అమ్ముతున్న మూఠాను హైదరాబాదులో అరెస్టు చేశారు. నిందితులు ఇతర రాష్ట్రాల నుంచి తుపాకులు తీసుకొచ్చి ఇక్కడ నకిలీ లైసెన్సుతో అమ్మకాలు చేస్తున్నారని హైదరాబాద్ సిటి కమిషనల్ సీవీ ఆనంద్ తెలిపారు. ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీస్ సంస్థల్లో పనిచేస్తూ అక్రమ దందా చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం క్యాష్ మేనేజ్‌మేంట్ సర్వీస్‌లలో పని చేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ ముఠాలో నలుగురు నిందితులను అరెస్టు చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసు ఉన్నతాధికారుల సంతకాలు పోర్జరీ చేస్తూ, దొంగతనంగా తుపాకులు తయారు చేస్తూ నకిలీ లైసెన్స్ లు ఇస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లుగా తెలిపారు. ఎవరికైన గన్ లైసెన్స్ కావాలంటే తమ డిపార్ట్‌మెంట్ నుంచి ఇస్తామని తెలిపారు. ఇలాంటి దొంగలముఠాల ద్వార పెద్దకుట్ర జరిగే అవకాశం ఉందన్నారు. అందరు అలెర్ట్‌గా ఉండండాలని సూచించారు .
తుపాకులు వారే తయారు చేస్తూ, నకిలీ లైసెన్స్‌లతో గన్స్ ని అమ్ముతున్న వారిలో అల్తాప్ హూస్సేన్, గుడి వెంకటరెడ్డి, శ్రీనివాస్, అఫీసుద్దీన్ , సలీం, రాజా, కేవీ రెడ్డిలను అరెస్టు చేశారు. వారి నుంచి 34 నకిలీ లైసెన్సులు, 33 తుపాకీలు, 140 రౌండ్స్ స్వాధీనం చేసుకున్నారు. వారి దగ్గర నుంచి 30 సింగల్ బోర్, 3 డబల్ బోర్ గన్లుతో పాటు ఒక లివాల్వర్,140 బుల్లెట్లని స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 34 ఫేక్ వెపన్ లైసెన్స్ బుక్స్‌ని, 29 విపన్ లైసెన్స్ బుక్స్‌ని స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని హైదరాబాద్ న్యూస్ కోసం