Hyderabad Bike Racing: ప్రమాదాలు జరుగుతున్న వారిలో మార్పు రావడం లేదు. ఖరీదైన బైకులపై మితిమీరిన వేగంతో దూసుకుపోతూ, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇతరుల్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావాలన్న కాంక్షతో అడ్డదారులు తొక్కుతున్నారు యువకులు. అర్దరాత్రి రోడ్లపై ప్రాణాలకు తెగించి బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్నారు. లైక్‌ల కోసం లైఫ్‌నే రిస్క్‌లో పెడుతున్నారు కొందరు యువకులు. బైక్ రేసర్ల చేష్టలతో భయబ్రాంతులకు గురవుతున్నారు తోటి ప్రయాణికులు. తాజాగా బైక్ రేసర్లపై ఉక్కుపాదం మోపారు (Hyderabad Police) హైదరాబాద్ పోలీసులు. ఎనిమిది మంది యువకులను అరెస్ట్ చేశారు నార్త్ జోన్ పోలీసులు. అంబర్ పేటకు చెందిన ప్లవర్ డెకరేటర్ మహమ్మద్ అల్తాఫ్, అదే ప్రాంతానికి చెందిన ఎండీ అజమ్, మహమ్మద్ అశ్వాక్, ఎం.డి. ఓమర్, సయ్యద్ అలీమ్, సయిద్, ఎండి.అన్వర్, ఎండి. జమీల్‌లతో పాటు తాడుబండ్‌కు చెందిన షేక్ చాంద్‌లు ముఠాగా ఏర్పడ్డారని చెప్పారు నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి. వీరు సోషల్ మీడియాలో ఫేమస్ అయి డబ్బులు సంపాదించాలనుకున్నారని, అల్తాఫ్ బైక్ రేసింగ్ చేస్తుండగా, మిగితా వారు అల్తాఫ్‌ను బైక్‌లపై వెంబడిస్తూ వీడియోలు తీస్తుండే వారని చెప్పారు.
తాజాగా వీరంతా అంబర్ పేట నుంచి హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్, ప్యారడైజ్ మీదుగా బేగంపేటకు అర్ధరాత్రి చేరుకున్నారని చెప్పారు డీసీపీ చందనా దీప్తి. దీనిపై కొందరు వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారని, చెప్పారు దీప్తి. ఎనిమిది మంది యువకులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి నాలుగు బైక్‌లు, ఒక యాక్టీవాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎండి.అన్వర్ తప్పించుకున్నాడని చెబుతున్నారు పోలీసులు. వీరి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని స్పష్టం చేశారు డీసీపీ దీప్తి. నగరంలో ఎవరైనా బైక్‌లపై ఫీట్లు చేస్తే చర్యలు తప్పని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు.
Also Read: