Telangana: ఎన్నికల వేళ మరో ట్విస్ట్.. మాజీ క్రికెటర్ల ఇళ్లపై ఐటీ సోదాలు.. పూర్తి వివరాలు..

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ బెల్లంపల్లి అభ్యర్ధి జి.వినోద్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. వినోద్‌తో పాటు మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అయూబ్ ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఈ తనిఖీలు కొనసాగాయి. ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతి విషయంలో తెలంగాణ ఏసీబీ గతంలోనే మూడు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసింది.

Telangana: ఎన్నికల వేళ మరో ట్విస్ట్.. మాజీ క్రికెటర్ల ఇళ్లపై ఐటీ సోదాలు.. పూర్తి వివరాలు..
Hyderabad Cricket Association

Updated on: Nov 22, 2023 | 5:14 PM

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ బెల్లంపల్లి అభ్యర్ధి జి.వినోద్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. వినోద్‌తో పాటు మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అయూబ్ ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఈ తనిఖీలు కొనసాగాయి. ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతి విషయంలో తెలంగాణ ఏసీబీ గతంలోనే మూడు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసింది. తాజాగా.. ఏసీబీ ఛార్జ్‌షీట్ల ఆధారంగా ఈడీ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. నవంబర్ 21, మంగళవారం వినోద్ సోదరుడు, కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీలో ఉన్న వివేక్ వెంకటస్వామి ఇళ్లు, కార్యాలయాలపై కూడా ఈడీ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయనకు సంబంధించిన సంస్థలో సుమారు రూ. 8 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్టు ఫిర్యాదు రావడంతో.. ఈడీ ఈ తనిఖీలు చేపట్టింది.

మరోవైపు ఈడీ సోదాలపై మాట్లాడిన వివేక్ వెంకటస్వామి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 12 గంటల పాటు తనిఖీలు నిర్వహించి.. చివరికి వట్టి చేతులతో ఈడీ వెళ్లారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల మధ్యకు రాకుండా 12 గంటలు తనను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ఐటీ రైడ్స్ జరిగాయని మండిపడ్డారు. అమిత్ షా, సీఎం కేసీఆర్ కలిసి ఈ ఐటీ రైడ్స్ చేయించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో పంట నష్టం జరిగినా.. చెన్నూరు నియోజకవర్గ ప్రజల ఇల్లు మునిగినా.. బాల్క సుమన్‌ ఏమేరకు స్పందించలేదని.. ఇలాంటి నేతకు ఓట్లు వేయాలా.? అంటూ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ రైతులకు, కౌలు రైతులకు పెద్దపీట వేస్తోందని తెలిపారు వివేక్ వెంకటస్వామి. రైతుని కోటీశ్వరుడిని చేస్తానని కేసీఆర్ మాట తప్పారని.. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ కారణంగానే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని దుయ్యబట్టారు. మీ జీవితాలు బాగుండాలంటే.. 6 గ్యారెంటీల కాంగ్రెస్‌ను గెలిపించండంటూ ప్రజలను కోరారు కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ వెంకటస్వామి.