Hyderabad: పల్లెబాట పట్టిన పట్నం.. ఎక్కడ చూసినా రద్దీనే, హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌..

| Edited By: Narender Vaitla

Jan 13, 2024 | 9:18 PM

అటు టోల్‌ప్లాజాల దగ్గర ఒకేసారి వేల వాహనాలు ఆగడంతో ట్రాఫిక్ జామ్‌ అవుతోంది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలతో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ బాగా పెరిగింది. టోల్‌ప్లాజా దగ్గర మొత్తం 16 టోల్‌ బూత్‌లు ఉండగా..

Hyderabad: పల్లెబాట పట్టిన పట్నం.. ఎక్కడ చూసినా రద్దీనే, హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌..
Vijayawada Highway
Follow us on

పల్లె పిలుస్తోంది. సంక్రాంతి రమ్మంటోంది. దీంతో పట్నం… పల్లెబాట పట్టింది. గ్రేటర్ హైదరాబాద్‌ను ఖాళీ చేసి సొంతూర్లకు వెళ్తున్నారు ప్రజలు. కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు పల్లెలకు పయనమవుతున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి.

అటు టోల్‌ప్లాజాల దగ్గర ఒకేసారి వేల వాహనాలు ఆగడంతో ట్రాఫిక్ జామ్‌ అవుతోంది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలతో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ బాగా పెరిగింది. టోల్‌ప్లాజా దగ్గర మొత్తం 16 టోల్‌ బూత్‌లు ఉండగా, విజయవాడ వైపు 12 గేట్లను తెరిచారు టోల్‌ప్లాజా సిబ్బంది. ఫాస్ట్ టాగ్ దగ్గర ఏదైనా ఇబ్బందులు జరిగితే తొందరగా వాహనాలు పోవడానికి వీలుగా హ్యాండ్ లీడర్ సౌకర్యం అందుబాటులో ఉంచారు.

ఇక రామోజీ ఫిల్మ్‌ సిటీ దగ్గర వేలాది వాహనాలు బారులు తీరి ఆగిపోయాయి. ఇక చౌటుప్పల్‌ దగ్గర వేలాది వాహనాలతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయి తిప్పలు పడుతున్నారు ప్రయాణికులు. ఇక పంతంగి టోల్‌ ప్లాజ్‌ దగ్గర కూడా సేమ్‌ సీన్‌ కనిపిస్తోంది. ఇక ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లలో ప్రయాణీకుల రద్దీని చూడొచ్చు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అయితే సంక్రాంతి రష్‌ నెక్ట్స్‌ లెవెల్‌లో ఉంది.

 

ఇక విజయవాడ హైవేపే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. చాలా నెమ్మదిగా వాహనాలు ముందుకుసాగుతున్నాయి. ముఖ్యంగా టోల్‌గేట్స్ వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఎల్బీనగర్‌ నుంచి పంతంగి వరకు 55 కిలోమీటర్లు ఉంటుంది. సాధారణ రోజుల్లో ఈ ప్రయాణానికి గంట సమయం పడుతుంది. అయితే ప్రస్తుతం ఏకంగా 3 గంటలు పడుతుంది. ఏకంగా 65 వేలకుపైగా వాహనాలు విజయవాడ హైవేపై ప్రయణిస్తున్నాయి.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..