
హైదరాబాదీలకు ముఖ్య అలెర్ట్ వచ్చేసింది. మరీ ముఖ్యంగా బీహెచ్ఈఎల్ పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్నవారు ఇది తప్పక చదవాల్సిందే. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా బీహెచ్ఈఎల్ జంక్షన్ దగ్గర ఫ్లై ఓవర్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ఫ్లై ఓవర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పనులకు ఆటంకం కలగకుండా ఉండేలా ఎన్‌హెచ్ఎఐ వినతి మేరకు అక్కడున్న జలమండలి పీఎస్సీ పైప్ లైన్‌ను వేరే చోటకి మార్చనుంది.
బీహెచ్ఈఎల్ ఫ్లై ఓవర్ వద్ద ఉన్న 1500 ఎంఎం డయా పైప్‌లైన్‌కు జంక్షన్ పనులు చేపట్టనున్నారు. ఈ పనులు మార్చి 8వ తేదీన అనగా శనివారం ఉదయం 6 గంటల నుంచి అదే రోజు సాయంత్రం 6 గంటల వరకు జరగనున్నాయి. దీంతో ఈ 12 గంటల పాటు బీహెచ్ఈఎల్ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల నీటి సరఫరాలో అంతరాయం.. అలాగే మరికొన్ని చోట్ల లో-ప్రెజర్‌తో నీటి సరఫరా జరగనుంది. మరి ఆ ఏరియాలు ఏంటన్నది చూసేద్దాం..
పైన పేర్కొన్న ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్న నేపధ్యంలో.. ఆయా ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు నీటిని శనివారం(మార్చి8) నాడు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరుతున్నాం.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి