Gold Smuggling RGIA: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా పట్టుబడిన బంగారం.. దాని విలువ ఎంతంటే..

Gold Smuggling RGIA: గోల్డ్ స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఫలితం లేకుండా పోతోంది. ప్రతీసారి కొత్త కొత్త ఎత్తుగడలతో బంగారాన్ని విదేశాల..

Gold Smuggling RGIA: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా పట్టుబడిన బంగారం.. దాని విలువ ఎంతంటే..
Gold

Updated on: Nov 14, 2021 | 6:53 AM

Gold Smuggling RGIA: గోల్డ్ స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఫలితం లేకుండా పోతోంది. ప్రతీసారి కొత్త కొత్త ఎత్తుగడలతో బంగారాన్ని విదేశాల నుంచి అక్రమంగా రవాణా సాగిస్తున్నారు. తాజాగా తెలంగాణలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రంయలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి AI 952 విమానంలో హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి వద్ద 671.9 గ్రాముల అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. నిందితుడు జుసర్‌లో బంగారం దాచి లగేజీ బ్యాగ్‌లో పెట్టుకుని తరలిస్తుండగా.. అధికారులు తనిఖీ చేసి పట్టుకున్నారు.

పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు రూ.34.18 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బంగారానికి సంబంధించి ధృవపత్రాలు ఏమానా ఉన్నాయా? ఎక్కడి నుంచి తీసుకువస్తున్నాడనే విషయంపై ఆరా తీస్తున్నారు. కాగా, ఈ మధ్య కాలంలో శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడుతోంది. రెండు రోజుల క్రితం కూడా బంగారం అక్రమ రవాణా చేస్తుండగా డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. గోల్డ్ స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు అధికారులు ఎన్నిరకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. స్మగ్లింగ్ మాఫియా మాత్రం తగ్గడం లేదు.

Also read:

Gold Price Today: మహిళలకు మళ్లీ నిరాశే.. పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‏లో ఎలా ఉన్నాయంటే..

Eyebrows: వయసు పెరిగే కొద్ది కనుబొమ్మలపై ఈ తేడాలు గమనించారా..! అసలు నిజం తెలుసుకోండి..

చైనీస్ అరటిపండు ఎప్పుడైనా తిన్నారా..! ఇది చాలా స్పెషల్.. ఎలా పండిస్తారో తెలుసా..?