కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో నమ్మకం పోయింది: డీకే అరుణ

| Edited By:

Apr 20, 2019 | 5:07 PM

మొన్నటివరకు కాంగ్రెస్‌లోనే ఉండి ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి డీకే అరుణ.. ఇప్పుడు ఆ పార్టీపైనే విమర్శలు చేస్తోంది. ఏకంగా కాంగ్రెస్‌పై ప్రజల్లో నమ్మకం పోయింది అంటూ ఆమె కామెంట్లు చేశారు. కాంగ్రెస్ వారిని గెలిపించినా చివరికి టీఆర్ఎస్‌లోనే చేరుతారని.. తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని పేర్కొన్నారు. నల్గొండలో ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన డీకే అరుణ.. దేశమంతా మరోసారి నరేంద్రమోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. చట్టాల్లో మార్పు కోసం తెలంగాణ సీఎం […]

కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో నమ్మకం పోయింది: డీకే అరుణ
Follow us on

మొన్నటివరకు కాంగ్రెస్‌లోనే ఉండి ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి డీకే అరుణ.. ఇప్పుడు ఆ పార్టీపైనే విమర్శలు చేస్తోంది. ఏకంగా కాంగ్రెస్‌పై ప్రజల్లో నమ్మకం పోయింది అంటూ ఆమె కామెంట్లు చేశారు. కాంగ్రెస్ వారిని గెలిపించినా చివరికి టీఆర్ఎస్‌లోనే చేరుతారని.. తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని పేర్కొన్నారు.

నల్గొండలో ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన డీకే అరుణ.. దేశమంతా మరోసారి నరేంద్రమోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. చట్టాల్లో మార్పు కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని అరుణ అభిప్రాయపడ్డారు. ఓటమి భయంతోనే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాక ముందే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళుతున్నారని.. అవినీతికి పాల్పడేది రెవెన్యూ అధికారులా..? లేక టీఆర్‌ఎస్‌ నాయకులా..? అని ప్రశ్నించారు.