హీరోయిన్ డింపుల్ వర్సెస్ డీసీపీ మధ్య పార్కింగ్ వివాదంలో ఎవరూ తగ్గట్లే. చిన్న గొడవ చినికిచినికి గాలివానగా మారింది. విషయం పోలీస్ స్టేషన్‌కు చేరింది. మరో అడుగు ముందుకేసిన డింపుల్.. డీసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తనను వేధిస్తున్నారని న్యాయపోరాటానికి సిద్ధమైంది. పార్కింగ్ ప్లేస్ కేంద్రంగా చెలరేగిన ఘర్షణలో ఎన్నో అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా డింపుల్ మీద పెట్టిన FIR కాపీ అందిందని ఆమె తరఫు లాయర్ పాల్ సత్యనారాయణ తెలిపారు. కారు కవర్ తీసినట్లు FIR లో పొందుపరిచారని.. అందుకు సంబంధించి ఆధారాలు ఉంటే తమకు చూపించాలన్నారు. అసలు ప్రభుత్వ వాహనాలకు కవర్ ఇస్తారా అని అడిగారు. ఈ కేసులో ఇప్పటి వరకు డీసీపీ మాట్లాడారు కానీ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎందుకు మాట్లాడటం లేదని డింపుల్ లాయర్ ప్రశ్నించారు. తనను తాను కాపాడుకునేందుకు డీసీపీ డ్రైవర్‌ను వాడుకుంటున్నారని ఆరోపించారు.
డీసీపీ… డింపుల్‌తో మిస్ బిహేవ్ చేశారని.. ప్రస్తుతం ఆమె డిప్రెషన్‌లో ఉందన్నారు. డింపుల్ మీద కావాలని ఆరోపణలు చేయిస్తున్నారని.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటి వద్ద సంచరిస్తున్నారని పేర్కొన్నారు. తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వస్తున్నాయని.. నటి డింపుల్‌కు ప్రాణ హాని ఉందంటూ సంచలన కామెంట్స్ చేశారు ఆమె లాయర్.
అసలేం జరిగింది….
జూబ్లీహిల్స్‌లోని ఎస్‌కేఆర్ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్స్‌లో ఈనెల 14న డింపుల్ హయతి, తన స్నేహితుడు డేవిడ్… పార్కింగ్ ప్లేస్‌లో ఉన్న రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని ఢీకొట్టిన డీసీపీ డ్రైవర్ కేసు పెట్టారు. అంతటితో ఆగకుండా కారుని కాలితో తన్నారని ఆరోపించాడు. డ్రైవర్ ఫిర్యాదుతో ఆస్తుల విధ్వంసం కింద డింపుల్‌పై 353, 341, 279 సెక్షన్ల కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు అని పిలిచి ఆమెను నాలుగు గంటలు స్టేషన్‌లోనే కూర్చోబెట్టినట్లు చెబుతున్నారు. అదే క్రమంలో డీసీపీ రాహుల్ డ్రైవర్‌పై కౌంటర్ కంప్లైంట్ చేస్తే పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించింది డింపుల్. దీంతో డీసీపీని ఉద్దేశించి హయతి ట్వీట్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పును కప్పిపుచ్చుకోలేరని పేర్కొంది.
ఈ ఇష్యూపై డీసీపీ మీడియాతో మాట్లాడారు. చాలాసార్లు చెప్పిచూసినా డింపుల్ న్యూసెన్స్ ఆగలేదన్నారు రాహుల్ హెగ్డే. వాంటెడ్లీ కారు అడ్డు పెడుతూ.. స్టాఫ్‌తో పాటు వాచ్‌మెన్‌తో గొడవపడే వారని అన్నారాయన. జరిగిన ఘటనపై లీగల్‌గానే వెళ్తున్నామని… నిజనిజాలు పోలీసుల దర్యాప్తులో బయటకు వస్తాయన్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. డీసీపీతో గొడవ అనంతరం జూబ్లిహిల్స్ పరిధిలో పలు ఉల్లంఘనల కింద వరుసగా 3 రోజులు డింపుల్ కారుకు ఫైన్స్ పడ్డాయి. డింపుల్ కారుకు పోలీసులు ఉద్దేశపూర్వకంగానే చలాన్లు వేశారని మండిపడ్డారు ఆమె ఫ్యాన్స్. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై కోర్టును ఆశ్రయించాలని డింపుల్ డిసైడ్ అయ్యారు. ఒక సెలబ్రిటీగా, అమ్మాయిగా.. ఒక పోలీస్ ఆఫీసర్‌పై కేసు పెట్టేందుకు డింపుల్ వెనుకాడారు. కానీ ఆయన తీరు ఏమాత్రం సరిగా లేదన్నారు డింపుల్ తరఫు న్యాయవాది. ఇప్పట్లో డింపుల్ వర్సెస్ డీసీపీ గొడవకు ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు. మరి కోర్టు ఏం తేలుస్తుందో.. ఎవరి వాదన నెగ్గుతుందో వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.