Dmart Fake LInk: సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. పోలీసులు, సైబర్ నిపుణులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా ఎప్పటికప్పుడు కొత్త దారి వెతుక్కుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఉచితం అనే మాటను ఎరగా వేసి డబ్బులు కాజేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఎన్నో ఘటనలు జరిగాయి. పోలీసులు వాటిని చేధిస్తూ ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ సైబర్ మోసమే వెలుగులోకి వచ్చింది. ఈసారి సైబర్ నేరగాళ్లు తమ నేరానికి డీమార్ట్‌ను పావుగా వాడుకున్నారు.
డీమార్ట్ షాపింగ్ మాల్ 20వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా వినియోగదారులకు ఉచితంగా బహుమతులు ఇవ్వనుందని ఓ లింక్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఇది మోసపూరితమైన లింక్ అని, డీమార్ట్ ఇలాంటి ఆఫర్‌ను ప్రకటించలేదని పోలీసులు తేల్చి చెప్పారు. పొరపాటున ఆ లింక్ క్లిక్ చేస్తే ఖాతాలోని డబ్బులు మొత్తం ఖాళీ అవుతాయని హెచ్చరించారు. డీమార్ట్ స్కామ్‌కు సంబంధించిన ఫేక్ లింక్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన సైబర్ వింగ్ పోలీసులు.. ‘బీ అలర్ట్ ఈ లింక్‌ను ఓపెన్ చేయొద్దు’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు.
ఈ మోసపూరిత లింక్‌ను క్లిక్ చేయగానే ఓ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో ఓ స్పిన్నర్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయగానే మీకు గిఫ్ట్ కార్డులు వచ్చాయంటూ అలర్ట్ వస్తుంది. వాటిని పొందాలంటే ఆ లింక్‌ను వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేయండి అంటూ ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పొరపాటు ఆ లింక్ క్లిక్ చేస్తే ఖాతాలోని డబ్బులు ఖాళీ అవుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరి మీకు కూడా ఇలాంటి లింక్ వస్తున్నాయా? అయితే ఎట్టి పరిస్థితుల్లో వాటి జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం.
బీ అలర్ట్.. ఈ లింక్ ఓపెన్ చేయవద్దు.#DMart pic.twitter.com/x9XmqHzWqO
— Economic Offences Wing Cyberabad (@EOWCyberabad) August 21, 2021
Also Read: AP Corona Cases: ఏపీలో కొత్తగా 1217 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా
తాత్కాలిక ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఇవ్వాలి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన..
Nani: హీరో నానికి క్షమాపణలు చెప్పిన థియేటర్ ఓనర్స్ అసోసియేషన్.. అపాలజీ లెటర్ రిలీజ్.. కారణమిదే..