దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన యువతిని కాపాడిన మాదాపూర్ లేక్ పోలీసులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్, మాదాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతి సమక్షంలో అభినందించారు. అనంతరం వారికి రివార్డులు అందజేశారు. ఎవరైనా ఆత్మహత్యలకు పాల్పడితే వారి ప్రాణాలను కాపాడాలన్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ భాను ప్రకాష్, దుర్గం చెరువు లేక్ పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ నవీన్ కుమార్, తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ కు చెందిన బోర్డ్ డ్రైవర్ ఎస్ మనోహర్, హైదరాబాద్ యాచ్ క్లబ్ కు చెందిన సెయిలింగ్ కోచ్ రజినీకాంత్ ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. సైబరాబాద్ పరిధిలోని దుర్గం చెరువు వద్ద ఏర్పాటుచేసిన లేక్ పోలీసింగ్ సత్ఫలితాలు ఇస్తుందని సీపీ అన్నారు.
నవంబర్ 29 (మంగళవారం) సాయంత్రం 6 గంటల సమయంలో మెహదీపట్నం రేతిబోలి ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న కుమారి హర్షిత మనిసిక ఒత్తిడి కారణంగా అకస్మాత్తుగా వంతెన మీద నుంచి చెరువులోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. బ్రిడ్జి పై పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న లేక్ పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ నవీన్ కుమార్ వెంటనే అప్రమత్తమై దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి కింది ఉన్న లేక్ పోలీసులను అప్రమత్తం చేశారు.
మాదాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ భాను ప్రకాష్, తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ కు చెందిన బొట్ డ్రైవర్ మనోహర్, హైదరాబాద్ యాచ్ క్లబ్ కు చెందిన రజనీకాంత్ తొబ్ కలిసి ఆ యువతిని రక్షించారు. ఆపై సీపీఆర్ చేసి, దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కు తరలించారు. అనంతరం యువతి పరిస్థితి నిలకడ నిలకడగా ఉందని తెలుసుకున్నాక వారి తల్లిదండ్రులను పిలిపించారు. వారికి కౌన్సిలింగ్ చేసి ఇంటికి పంపించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం