Hyderabad: నేషనల్ పోలీస్ అకాడమీలో పనిచేస్తున్న అధికారికి సైబర్ కేటుగాడు ఫోన్.. ఆ తర్వాత ఇది సీన్

| Edited By: Ram Naramaneni

Nov 22, 2024 | 3:22 PM

ఆ అధికారి నేషనల్ పోలీస్ అకాడమీలో హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నాడు. ఇటీవల ఆయనకు ఓ సైబర్ నేరస్థులు ఫోన్ చేశాడు. ప్రధానమంత్రి ఆరోగ్య యోజన స్కీమ్ కింద ఆయన ఖాతాలో నగదు పడ్డాయని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత...

Hyderabad: నేషనల్ పోలీస్ అకాడమీలో పనిచేస్తున్న అధికారికి సైబర్ కేటుగాడు ఫోన్.. ఆ తర్వాత ఇది సీన్
National Police Academy
Follow us on

ఫోన్ నంబర్స్ సంపాదించి.. మాయ మాటలతో చీట్ చేసి.. అకౌంట్లలో ఉన్న సొమ్ము కాజేయడం సైబర్ నేరగాళ్ల స్టైల్. ఇలా రోజూ వందలు, వేల మంది మోసపోతున్నారు. అయితే కొన్నిసార్లు నేరగాళ్లు.. పోలిస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నవాళ్లకి సైతం తెలియక కాల్స్ చేస్తుంటారు. అవతలి వ్యక్తి పోలీస్ అని తెలిశాక.. వారికి ఒక్కసారిగా దడ పుడుతుంది. తాజాగా హైదరాబాదులో ఉన్న నేషనల్ పోలీస్ అకాడమీలో పనిచేస్తున్న ఒక అధికారికి సైబర్ నేరస్తులు కాల్స్ చేశారు. అతడిని ట్రాప్ చేయాలని చూసిన సైబర్ నెరగాళ్లకు చేదు అనుభవం ఎదురయింది.

ఏదో ఒక స్కీమ్ చెప్పి డబ్బులు వస్తాయని మభ్యపెట్టి బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తీసుకొని ట్రాప్ చేద్దాం అని సైబర్ నేరస్తులు ప్లాన్ చేశారు. నేషనల్ పోలీస్ అకాడమీలోని హెల్త్ సెక్టార్‌లో పనిచేస్తున్న ఒక అధికారికి అలానే ఫోన్ చేశారు. నిందితులు ప్రధానమంత్రి ఆరోగ్య యోజన కింద.. డబ్బులు వచ్చాయని అధికారిని నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో సదరు అధికారి నిజనేమో అని భావించి.. తన భార్య బ్యాంక్ అకౌంట్ నెంబర్‌ను నిందితులకు ఇచ్చాడు.

ఆ కాల్ కట్ చేసిన వెంటనే తన భార్య నుంచి అధికారికి ఫోన్ వచ్చింది. తన బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు కట్ అవుతున్నాయని చెప్పటంతో అధికారి అలర్ట్ అయ్యాడు. వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సైబర్ క్రైమ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ అధికారులు ట్రాన్సాక్షన్ ఐడి ద్వారా నిందితులను కనిపెట్టారు. వెంటనే నిందితులకు చెందిన బ్యాంక్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు. దీంతో కంగుతిన్న సైబర్ నేరస్తులు మళ్లీ పోలీస్ అకాడమీలో ఉన్న అధికారికి కాల్ చేశారు. తన కంప్లైంట్ విత్ డ్రా చేసుకోవాలని, తాము కాజేసిన డబ్బును తిరిగి ఇచ్చేస్తామని అధికారికి సైబర్ నేరస్తులు కాల్స్ చేశారు.

కంప్లైంట్‌ను వెనక్కి తీసుకోవాలని పదేపదే కాల్స్ చేస్తుండటంతో అధికారి మళ్లీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒకసారి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబర్ నేరస్తులు వాడుతున్న బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. దీంతో సైబర్ నేరస్తులు ఆ ఖాతాలో ఉన్న డబ్బును ఉపయోగించుకోవడానికి వీలుపడదు. ఎంత మంది సొమ్ము కాజేశారో.. ఆ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉందో ఏమో కానీ… సైబర్ నేరస్తులు పోలీస్ అకాడమీలో ఉన్న అధికారికి ఫోన్ చేసి తన కంప్లైంట్‌ను వాపస్ తీసుకోవాలని వేడుకుంటూ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..