Telangana: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. 50 మంది నకిలీ వైద్యుల గుట్టురట్టు.. వామ్మో కథ పెద్దదే..

|

May 26, 2024 | 9:10 AM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటినుంచి అక్రమార్కుల ఏరివేత విషయంలో దూకుడు పెంచింది. మొన్నటి వరకూ డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపిన సర్కార్.. గత నాలుగైదు రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రముఖ హోటల్లు మార్కెట్ మాల్స్ పై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల మెరుపు దాడులు చేశారు.

Telangana: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. 50 మంది నకిలీ వైద్యుల గుట్టురట్టు.. వామ్మో కథ పెద్దదే..
Fake Doctors
Follow us on

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటినుంచి అక్రమార్కుల ఏరివేత విషయంలో దూకుడు పెంచింది. మొన్నటి వరకూ డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపిన సర్కార్.. గత నాలుగైదు రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రముఖ హోటల్లు మార్కెట్ మాల్స్ పై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల మెరుపు దాడులు చేశారు. పలు హోటళ్లలో కాలం చెల్లిన ఆహార పదార్థాలు గుర్తించారు. ఇప్పుడు తెలంగాణ వైద్య మండలి అధికారులు పలు క్లినిక్స్‌పై దాడి చేశారు. హైదరాబాద్, మేడ్చల్ పరిధిలోని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఐడీపీఎల్, చింతల్, షాపూర్‌నగర్‌లలో నిర్వహించిన తనిఖీల్లో 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు.

8 మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో తనిఖీలు చేశారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తోన్న పలు క్లినిక్స్‌ను సీజ్ చేశారు. కొందరు నకిలీ వైద్యులు ఆరోగ్య కేంద్రాల్లో రోగులను చేర్చుకుని అధికంగా యాంటీ బయాటిక్స్ ఇస్తున్నట్లు గుర్తించారు. డాక్టర్లుగా చెలామణి అవుతూ వారికి అనుసంధానంగా మెడికల్‌ షాపులు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. దాదాపు 50 మంది నకిలీ వైద్యులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేసి, ఇద్దరిని జైలుకు పంపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నకిలీ వైద్యులు, క్లినిక్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు. తప్పుడు ప్రకటనలతో ఔషధాలు తయారు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తోన్న తయారీ సంస్థలపైనా తెలంగాణ ఔషధ నియంత్రణ శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు.

ఈ నెల 23, 24 తేదీల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన అధికారులు.. కొన్ని చోట్ల సోదాల్లో నకిలీ ఔషధాలు గుర్తించారు. ప్రజలు ఇలాంటి ఔషధాల పట్ల అలర్ట్‌గా ఉండాలని సూచించారు. నకిలీ మెడిషిన్‌ విక్రయాలపై టోల్‌ఫ్రీ నెంబర్‌కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని డ్రగ్ కంట్రోల్ అధికారులు సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..