Hyderabad: హైదరాబాద్‌లో కరోనా కలకలం.. కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు పాజిటివ్

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాచింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వేగంగా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో కొవిడ్‌ కలకలం రేపింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కొవిడ్‌ కేసు నమోదయింది. కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కొవిడ్‌ పాజిటివ్ అని తేలింది ..

Hyderabad: హైదరాబాద్‌లో కరోనా కలకలం.. కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు పాజిటివ్
Corona Positive

Updated on: May 23, 2025 | 6:48 PM

మళ్లీ కరోనా టెర్రర్ మొదలయింది. ఈ మాయదారి వైరస్ రూపం మార్చుకుని మరోసారి పౌరులపై దండెత్తింది. తాజాగా తెలంగాణలో సైతం కోవిడ్ కలకలం  చెలరేగింది. హైదరాబాద్‌లోకి కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కరోనా సోకింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలు మాస్కులు ధరించాలని  వైద్యారోగ్య శాఖ సూచించింది.

ఏపీలోనూ వైరస్ టెన్షన్… 

ఏపీలోని విశాఖలో ఓ మహిళకు కరోనా పాజిటవ్‌గా నిర్దారణైంది. ఆమె కాంటాక్ట్స్ వెరిఫై చేసిన అధికారులు.. ఎవరికి లక్షణాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆమె కుటుంబం ఉంటోన్న పరిసరాల్లో శానిటైజేషన్‌ చేశారు. పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఏపీ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. దేశంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్య్టా ప్రజలను అప్రమత్తం చేయాలంటూ సిబ్బందికి సూచనలు జారీ చేసింది. సమూహాలుగా ఏర్పడే కార్యక్రమాలు చేయొద్దంటోంది ఆరోగ్యశాఖ. జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు ఉంటే.. వెంటనే కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని చెబుతోంది. రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, ఎయిర్‌పోర్టుల్లో.. సోషల్‌ డిస్టెన్స్, మాస్క్ తప్పనిసరి అని హెచ్చరిస్తోంది. విదేశాల నుంచి వచ్చినవారు తప్పనిసరిగా కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తోంది. అధికారులకు ప్రత్యేక సూచనలు చేసిన హెల్త్ డైరెక్టర్.. మాస్కులు, పీపీఈ కిట్లు, అందుబాటులో ఉంచాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.