ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేసినా… శుభ్రంగా లేని ఎన్నో షాపులను ముసేయించినా కొందరిలో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. అదే అపరిశుభ్రత.. అదే నిర్లక్షంతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో మరో ఘటన వెలుగుచూసింది. సరదాగా ఫ్యామిలీతో కలిసి తిందామని… ఇంటికి చాట్ తీసుకెళ్లిన ఓ వ్యక్తికి షాక్ తగిలింది. బాక్స్ ఓపెన్ చేసి చూడగా… బొద్దింక దర్శనమివ్వడంతో ఒక్కసారిగా అతను అవాక్కయ్యాడు. వెంటనే ఆ చాట్‌ను తీసుకెళ్లి… షాపు యజమానికి చూపించి నిలదీశాడు. ఈ చాట్‌ను చూసుకోకుండా చిన్న పిల్లలు తింటే పరిస్థితేంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. యజమాని నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో… ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే అధికారులు వెంటనే స్పందించి… ఇలాంటి షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశాడు.
రవి అనే వ్యక్తి.. పిల్లల కోసం.. వనస్థలిపురం పనామా వద్ద ఉన్న మిఠాయివాలా స్వీట్స్ అండ్ బేకరీ వద్ద చాట్ బండారు ఆర్డర్ చేసి ఇంటికి తీసుకెళ్లాడు. తీరా ఇంటికి వెళ్లి తిందామని బాక్స్ ఓపెన్ చేయగా.. పెద్ద బొద్దింక దర్శనమిచ్చింది. దీంతో చాట్ బండార్ డబ్బాతో వచ్చి యజమానిని నిలదీశాడు. సదరు యజమాని మాత్రం నిర్లక్ష్యపు సమాధానం చెప్పాడని.. ఈ విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని బాధితుడు రవి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు రవి డిమాండ్ చేశాడు. ఫుడ్ సేఫ్టీ అధికారులు నామమాత్రపు తనిఖీలతో జరిమానాలు విధించి వదిలేస్తున్నారని.. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..